- అద్దె డ్రైవర్లపైనే భారం
- వేధిస్తున్నటెక్నీషియన్ల కొరత
- 108 సిబ్బంది సమ్మె ఎఫెక్ట్
ములుగు : ఆపదలో ఆదుకునే అపర సంజీవని 108 వాహనం. ఇంత కీలకమైన సేవలు ప్రస్తుతం తూతూమంత్రంగానే అందుతున్నాయి. వారం రోజులుగా సిబ్బంది సమ్మె చేస్తుండడం సేవలపై ప్రభావం చూపిస్తోంది. యూజమాన్యం తాత్కాలికంగా ట్రాక్టర్, వ్యాన్ డ్రైవర్లను రోజువారీ వేతనంతో నియమించుకుంటోంది. రోగులకు మార్గమధ్యలో ప్రథమ చికిత్స చేయడానికి టెక్నీషియల్లు కూడా కరువయ్యూరు. పరికరాలు అందుబాటులో ఉండడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయూంలో108 సేవలను ప్రారంభించారు. జిల్లాలోని 51 మండలాల్లో 40వాహనాలు రోగులకు సేవలు అందించాయి. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014లో ఉద్యోగులంతా సమ్మె చేపట్టారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన యాజమాన్యం అప్పుడు కొంత మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారిని నియమించుకుంది. మరో దఫా ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ప్రస్తుతం 40వాహనాలు నడుస్తుండగా 185 మంది డైవర్లు, ఈఎమ్‌టీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లు) పనిచేస్తున్నారు. వారంతా సేవలు అందించడానికి నిరాకరించడంతో యాజమాన్యం తాత్కాలిక ఉద్యోగులపై ఆధారపడుతోంది.
శిక్షణ నాలుగు రోజులే..!
108లో ఉద్యోగులకు నాలుగు నెలలు శిక్షణ ఇచ్చాకే విధుల్లోకి తీసుకున్నారు. కానీ ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగులకు నాలుగు రోజులే శిక్షణ మమ అన్పించి నియూమకాలు చేసేస్తున్నారని సమాచారం. సంస్థ నుంచి కాల్ రాగానే డ్రైవర్లు మాత్రమే ఘటనాస్థలానికి వెళ్లి రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మార్గమధ్యలో పరిస్థితిని సమీక్షించే టెక్నిషియన్లు అందుబాటులో లేరు. అయితే తాత్కాలిక డ్రైవర్లను చిన్నచిన్న సమస్యలకు మాత్రమే వాడుతున్నారని తెలిసింది. దీనికి గాను వీరికి రోజువారిగా రూ.300 చెల్లిస్తున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు..
కనీస వేతనంగా రూ.20వేలు అందించాలి. 2014 సమ్మె సందర్భంగా ఉద్యోగాలు కోల్పోరుున వారిని విధుల్లోకి తీసుకోవాలి. 108లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. రోజు వారీగా 8గంటల పని దినాలు మాత్రమే ఉండాలి.
108 సేవలు మమ
Published Fri, May 22 2015 4:39 AM | Last Updated on Mon, Aug 13 2018 4:05 PM
Advertisement