
ప్రేమించి పెళ్లి చేసుకోలేదని యువకుడిపై దాడి
ఎమ్మిగనూరు రూరల్: తన చెల్లెలను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆ యువతి అన్న స్నేహితులతో యువకుడిపై దాడి చేశాడు. శనివారం రాత్రి ఎమిగ్మనూరు పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్‌టీఆర్ కాలనీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న లక్ష్మన్న శివన్న నగర్‌కు చెందిన అరుణ లు ప్రేమించుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటంతో రెండు సంవత్సరాల క్రితం ఆయువకుడిపై పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో ప్రస్తుతం నడుస్తుంది.
అరుణ సోదరుడు మహేష్ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి లక్మన్న ఇంటి దగ్గరకు వెళ్లి తన చెల్లెలును పెళ్లి చేసుకోవాలని వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో మహేష్, అతని స్నేహితులు ఇద్దరు, అరుణ, తల్లి లక్ష్మి లక్ష్మన్నపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడంలో అతడిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండ టంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ శంకరయ్య విలేకరులకు వెల్లడించారు.