రెండు బస్సులు ఢీ: 15 మందికి గాయాలు | 20 people injured in road accident | Sakshi
Sakshi News home page

రెండు బస్సులు ఢీ: 15 మందికి గాయాలు

Published Mon, Aug 29 2016 7:16 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

20 people injured in road accident

నకిరేకల్(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవే ట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న సమయంలో అదే మార్గంలో విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement