దుర్గామాత నిమజ్జనంలో తేనెటీగలు దాడి చేసి.. 20మందిని గాయపరిచాయి.
నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం నర్వ గ్రామంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా భక్తులపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 10 మంది చిన్నారులతోపాటు 20 మందికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా వాగు దగ్గరకు తీసుకెళ్లగా... సమీపంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేసి కుట్టాయి. గాయపడిన వారికి ప్రైవేటు డాక్టర్‌ను పిలిపించి గ్రామంలోనే వైద్య సేవలు అందించారు.