bees
-
తేనెటీగల కోసం కృత్రిమపూలు..!
తేనెటీగలు నానాటికీ తగ్గుతుండటంపై ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు అంతరించిపోతే, భూమ్మీద మానవులు కూడా అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా వారు హెచ్చరికలు చేస్తున్నారు. పట్టణీకరణ పెరుగుతుండటంతో అడవులు, అడవుల్లో ఉండే తేనెనిచ్చే పూలమొక్కలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తేనెటీగలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే డచ్ డిజైనర్ మటిల్డా బోయల్హోవర్ తేనెటీగల మనుగడ కోసం కృత్రిమ పూలను తయారు చేశారు. జనావాసాలతో కిక్కిరిసి ఉండే నగరాల్లో ఈ పూలను ఇళ్లల్లోని పూలకుండీల్లో అమర్చుకోవడానికి వీలుగా రూపొందించారు. ఈ పూలు వాననీటిని చక్కెరతో కూడిన ద్రవంగా మార్చగలవు. తియ్యగా ఉండే ఈ ద్రవం సహజమైన తేనె మాదిరిగానే తేనెటీగలను ఆకట్టుకోగలదు. తేనెటీగలతో పాటు ఈ పూలు వృక్షజాతుల్లో పరపరాగ సంపర్కానికి దోహదపడే సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, కందిరీగలు వంటి కీటకాలను కూడా ఆకర్షించగలవని డిజైనర్ మటిల్డా చెబుతున్నారు. (చదవండి: తేనెటీగల కోసం కృత్రిమపూలు) -
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
దేశంలో ఈరోజు(మంగళవారం) లోక్‌సభ ఎన్నికల్లోని మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లోని అరా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిదిమంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆసుపత్రిలో జష్పూర్ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈరోజు ఉదయం 7 గంటలకు జష్ఫూర్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలుత 85 ఏళ్ల విద్యావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ బృందాన్ని నియమించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశారు. జష్పూర్ జిల్లా పరిధిలో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో నలుగురు ఉద్యోగుల బృందం విధులు నిర్వహిస్తుంది. -
సరదాగా పిక్నిక్ వెళ్తే ఏం జరిగిందంటే.?
-
అచ్చం తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలు..ప్రత్యేకతలివే
కొన్ని రకాల పంటలు, పండ్ల తోటల్లో పరపరాగ సంపర్యానికి అత్యవసరమైన తేనెటీగల సంఖ్య ప్రకతిలో అంతకంతకూ తగ్గిపోతుండంతో అగ్రిటెక్ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి.ఇజ్రాయెల్‌కి చెందిన ‘బ్లమ్‌ఎక్స్’ కంపెనీ తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలను రూపొందించింది. పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలను పూర్తిచేసుకున్న రోబో తేనెటీగ యంత్రాలు (రోబో–బీలు/రోబీలు) మెక్సికో, పెరూ తదితర దేశాల్లోని బ్లూబెర్రీ, అవకాడో(వెన్నపండు) పండ్ల తోటల్లో హల్చల్ చేస్తున్నాయి. పంటల అవసరాలను బట్టి ప్రత్యేక రోబీలను రూపొందిస్తుండటం విశేషం. రసాయనిక సాంద్ర వ్యవసాయ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) గణాంకాల ప్రకారం.. సాగు భమి విస్తీర్ణం 1961 తర్వాత 600% పెరిగితే, ఇదే కాలంలో పెట్టెల్లో తేనెటీగల పెంపకం 83% మాత్రమే పెరిగింది. కాలిఫోర్నియా(అమెరికా)లో విస్తారంగా సాగవుతున్న బాదం తోటల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరిపించేందుకు విదేశాల నుంచి ఏకంగా ఏడాదికి 4,800 కోట్ల తేనెటీగలను దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ పని పూర్తయ్యాక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ప్రయాణంనే కోట్లాది తేనెటీగలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశ సరిహద్దులు దాటి తేనెటీగల దిగుమతిలో పర్యావరణ సమస్యలున్నాయి. ఈ సమస్యలను అధిగమిస్త.. తేనెటీగల కొరతను రోబో తేనెటీగలతో ‘బ్లూమ్‌ఎక్స్’ తీర్చే ప్రయత్నం చేస్తోంది. బ్లూబెర్రీ తోటల్లో ‘రోబీ’ రొద ఇజ్రాయెల్‌లోని ఓ చిన్న వ్యవసాయ గ్రామం రిష్పన్లో బ్లమ్‌ఎక్స్ 2019లో ఏర్పాటైంది. సీఈఓ థాయ్ సదెది అదే ఊరు. ఇప్పటికైతే బ్లబెర్రీ, అవకాడో పంటల కోసం వేర్వేరుగా ప్రత్యేక ‘రోబో–బీ’ యంత్రాలను రూపొందించింది. ఈ రెండంది. ఈ రెండూ దిగుబడి పెంచితే రైతుల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉన్న ఖరీదైన పంటలు. అందుకే వీటిని ఎంపికచేసుకున్నామన్నారు బ్లూమ్‌ఎక్స్ ప్రతినిధి ఎమిలీ స్పీసర్. బ్లబెర్రీ చెట్ల పూలల్లోనే ఆడ, మగ భాగాలుంటాయి. అయితే, పుప్పొడి ఆడ భాగాలకు చేరాలంటే తేనెటీగలు మగ భాగాలను స్పృశించి మంద్రంగా కదపాల్సి ఉంటుంది. ఈ పని అనేక దఫాలు జరిగితేనే చక్కటి దిగుబడి వస్తుంది. సరిగ్గా జరగకపోతే పండ్ల సంఖ్యతోపాటు సైజు కూడా తగ్గిపోతుంది. కాబట్టి, బ్లబెర్రీ చెట్ల వరుసల మధ్య నుంచి రోబోను మనిషి నడుపుతూ తీసుకెళ్తుంటే.. రోబో తన చేతులు చాచి పూలను తగుమాత్రంగా చురుగ్గా కదుపుతూ పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది. దీన్ని ‘రోబీ’ అంటున్నారు. కృత్రిమ మేధ సాయం ఏయే తోటల్లో పొలినేషన్ సేవలు ఎప్పుడు అవసరమో తెలుసుకోవటం కోసం డేటాబేస్లను కృత్రిమ మేధతో మేళవించే మొబైల్ అప్లికేషన్‌ను రైతులకు కంపెనీ అందిస్తోంది. అవకాడోలు, బ్లబెర్రీలు ఎక్కువగా సాగయ్యే మెక్సికో, పెర, కొలంబియా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో రైతులు ఈ ‘రోబీ’లను వాడుతున్నారు. దిగుబడి బ్లబెర్రీలో 30%, అవకాడోలో 40% పెరిగిందట. అవకాడో తోటలో ‘క్రాస్బీ’అవకాడో ఎత్తు పెరిగే చెట్లు. ఈ చెట్లకు ఆడ, మగ పూలు పూస్తాయి. అయితే, మగ పూలు విచ్చుకున్న కొద్ది గంటల తర్వాత గానీ ఆడ పూలు విచ్చుకోవు. మగ పూలను తాకిన తేనెటీగలకు పుప్పొడి రేణువులు అంటుకుంటాయి. కొన్ని గంటల తర్వాత ఆడ పూలను తేనెటీగలు తాకినప్పుడు ఆ పుప్పొడి ఈ పూలకు అంటడం వల్ల పరపరాగ సంపర్కం సజావుగా సాగుతుంది. ఈ అవసరాలకు అనుగుణంగా పరపరాగ సంపర్కం జరిపేందుకు ‘క్రాస్బీ’ పేరుతో బ్యాడ్మింటన్ బ్యాట్ మాదిరి చేతి రోబో పరికరాన్ని బ్లమ్‌ఎక్స్ రపొందింంది. దీనితో పువ్వులపై సున్నితంగా రుద్దితే పుప్పొడి దానికి అంటుతుంది. ఆ పుప్పొడిని సేకరిం భద్రపరుస్తారు. కొన్ని గంటల తర్వాత ఆడ పూలు విచ్చుకున్నప్పుడు రోబో చేతితో ఈ పుప్పొడిని ఆ పూలకు సున్నితంగా రుద్దుతారు. ఈ విధంగా విజయవంతంగా పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు రుజువైందని సంస్థ తెలిపింది. వేర్వేరు రకాల అవకాడో చెట్లను పక్కపక్కనే నాటితే.. అప్పటికప్పుడే పరపరాగ సంపర్కం జరిగిపోతుంది. పుప్పొడిని భద్రపర, తర్వాత వినియోగించాల్సిన అవసరం ఉండదని సంస్థ వివరింంది. -
ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే!
ప్రకృతిలో తేనెటీగల వంటి చిరుప్రాణులు లేక పోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మొక్కల్లో పూలు కాయలుగా మారడానికి పరాగ సంపర్కమే కారణం. ఈ ప్రక్రియకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరిస్తూ పంటల ఉత్పాదనలో ఈ చిరుప్రాణులు తోడ్పడటం వల్లనే మనం మూడు పూటలా తినగలుగుతున్నాం. మనం తింటున్న ప్రతి మూడో ముద్ద ముఖ్యంగా తేనెటీగల పుణ్యమే. తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే, తేనెటీగలు అంతరిస్తే నాలుగేళ్లలోనే మానవ జాతి అంతరిస్తుంది అన్నాడో మహనీయుడు. తేనెటీగల ఉసురు తీస్తున్న పురుగుమందులు, కలుపుమందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలకు ఇప్పుడు అదనంగా ‘వాతావరణ మార్పులు’తోడయ్యాయి. అందువల్ల కరువు, కుంభవృష్టి వంటి వాతా వరణ మార్పు ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ తేనెటీగలను సైతం కనిపెట్టుకుని ఉండాలి. – సాక్షి సాగుబడి డెస్క్ మనం ఏం చేయగలం? ♦ అటవీ ప్రాంతాలను నాశనం చేయకుండా ఉండటం.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక రకాల పూల మొక్కల్ని పెంచటం.. ♦నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో, మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో, ముఖ్యంగా రోడ్ల పక్కన ఖాళీ జాగాల్లో కూడా మొక్కలతోపాటు స్థానిక జాతుల పూల మొక్కల్ని విస్తృతంగా పెంచటం.. ♦ రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం.. ♦తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించటం వంటి పనులను మనం చేస్తుంటే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. తేనెటీగల వంటి చిరు జీవులు మనుగడ సాగిస్తాయి. మనల్ని రక్షిస్తాయి.. తేనెటీగలు.. కొన్ని వాస్తవాలు ♦ తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలంలో సుమారు 1.5 నెలలు; పని లేని సీజన్లో సుమారు 2.5 నెలలు. ∙అర కిలో తేనె ఉత్పత్తికి 556 తేనెటీగలు పని చేయాల్సి ఉంటుంది. ♦ తేనెటీగల సంతతి వసంత రుతువులో 15,000 ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుంది. ♦ 2021లో ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తయిన తేనె: 1.77 మిలియన్ మెట్రిక్ టన్నులు 20,000 ప్రకృతిలో ఉన్న తేనెటీగల జాతులు.. పరాగ సంపర్కానికి దోహదపడే.. అంతరించిపోయే ముప్పుఎదుర్కొంటున్న సకశేరుక (వెన్నెముక ఉన్న) జాతులు 16.9 అంతరించిపోతున్న తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి అకశేరుక (వెన్నెముక లేని) జాతులు 40% తేనెటీగలు తదితర కీటకాల పరాగసంపర్కమే ఆధారం. పుష్పించే అడవి మొక్కలు/చెట్లలో తేనెటీగలు/జంతువుల పరాగసంపర్కంపై ఆధారపడుతున్నవి. 90% ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్కంపై ఆధారపడి ఉన్న ఆహార పంటలు. 75% -
ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు!
సాక్షి, అమరావతి: తేనెటీగలు.. సృష్టిలోనే ఓ గొప్ప సహజసిద్ధ ఇంజనీర్లు. షడ్భుజాలతో ఆరు వేల గదుల ఇళ్లను పక్కపక్కనే నిరి్మంచుకోగల సామర్థ్యం వీటి సొంతం. సమైక్య జీవనానికి ప్రతీకలైన మధుమక్షికలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి.. పూలలోని మకరందాన్ని సేకరించుకొస్తాయి. వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు, మొక్కలు మనగలుగుతున్నాయి. ఎన్నో పంటలు వీటివల్లే పండుతున్నాయి. ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే.. తేనెటీగలు మొత్తం అంతరించిపోతే కేవలం 30 రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించిపోతుంది. అంతటి విశిష్టత గల తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచి్చపడింది. 180 రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్య సమితి తేల్చింది. వీటిని సంరక్షించేందుకు రంగంలోకి దిగింది. భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు (మధుమక్షికలు) కూడా అంతే అవసరం. నేలపై ఉన్న వృక్ష జాతులతోపాటు 90 శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ. ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు, కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతోందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగం. మానవ మనుగడ అంతా వాటిపైనే ఆధారపడి ఉంది. పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వాçßæకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే, ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారమైన తేనె, రాయల్ జెల్లీ, మైనం వంటి వాటిని అందించడంతో పాటు తేనెటీగల విషాన్ని సేకరించి ఇతర ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. పురుగు మందుల వాడకంతో.. పంటల రక్షణ కోసం పురుగు మందులను మితిమీరి వినియోగిస్తుండటంతో తేనెటీగల జాతి తగ్గిపోతోందని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్టు యూకే అగ్రికల్చరల్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో గత పదేళ్లలో 13 జాతులు అంతరించిపోగా.. మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది. అందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ (ఐయూసీఎన్) ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్‌లో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. రక్షణకు తక్షణ చర్యలు అవసరం మొక్కలు, పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ 2018 మేలో నియోనికోటినాయిడ్స్ అని పిలిచే మూడు రకాల పురుగుమందులపై నిషేధాన్ని విధించింది. అయితే, అంతకు ముందే 2011లో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. కాగా, 2019 చైనాలోని కుని్మంగ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (కాప్–15)లో 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులు తగ్గించాలని నిర్ణయించింది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని.. ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారమని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు. తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. మూడో వంతు ఆహారోత్పత్తి వీటివల్లే.. ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టం సరీ్వస్ (ఐపీబీఈఎస్) పేర్కొంటున్న ప్రకారం దాదాపు 80 మిలియన్ల సంవత్సరాలుగా తేనెటీగల ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి. ఏటా 1.77 మిలియన్ మెట్రిక్ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడోవంతు తేనెటీగల పైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, పక్షులు, కొన్ని జంతువులు, కీటకాలు పరాగ సంపర్కానికి, మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్నా.. అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందున్నాయి. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? -
మల్బరీ, ‘తేనె’ కంచెలతో ఏనుగుల దాడులకు చెక్!
ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అడవులకు దగ్గరగా నివసించే రైతులు, గ్రామీణుల జీవనం ప్రాణసంకటంగా మారుతోంది. పలువురు ఏనుగుల దాడిలో పంటలను, ఆస్తులతోపాటు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా తరచూ వింటూనే ఉన్నాం. మన దేశంలో ఏనుగుల దాడుల్లో ఏటా దాదాపు 500 మంది మృత్యువాతపడుతున్నారు. 2015–2020 మధ్యలో సుమారు 2,500 మంది ఏనుగుల దాడుల్లో చనిపోయారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలోనే అత్యధికంగా 170 మంది చనిపోయారు. ప్రజల ప్రతి దాడుల్లో ఈ ఐదేళ్లలో 500 వరకు ఏనుగులు కూడా చనిపోయాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల దాడి సంఘటనలు వేసవిలో ఏటేటా పెరుగుతున్నాయి. కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఏనుగులు–మనుషుల మధ్య సంఘర్షణను నివారించడానికి లేదా తగ్గించడానికి అనేక పద్ధతులు అందుబాటులో వున్నాయి. ఊళ్ల చుట్టూ పెద్ద కందకాలు తవ్వటం, శిక్షణ ఇచ్చిన ఏనుగులతో అటవీ ఏనుగుల గుంపులను పారదోలటం వంటి నివారణ చర్యలు ఉన్నా ఫలితం అంతగా ఉండటం లేదు. అయితే, రెండు పరిష్కార మార్గాలున్నాయి. తేనెటీగల కంచెలతో చెక్! ఈ నేపథ్యంలో ఏనుగులు పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడే సరిహద్దు ప్రాంతాల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీ–ఫెన్సెస్)ను ఏర్పాటు చేయటం అనే పద్ధతి ఒకటుంది. తేనెటీగల ధ్వని వినిపించగానే ఏనుగులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పద్ధతిని గతంలోనే కేరళలో అమలు చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) కర్ణాటకలోని కొడగు జిల్లాలో ‘రీ–హేబ్’ పేరిట పైలట్ ప్రాజెక్టులో భాగంగా తేనెటీగల కంచెలు ఏర్పాటు చేసి పంటలపై, గ్రామీణులపై ఏనుగుల దాడులను విజయవంతంగా నివారించగలిగారు. తేనెటీగల గుంపులు శబ్దం చేసుకుంటూ ఏనుగులను చుట్టుముట్టి శబ్ధం చేస్తూ, వాటి తొండాల్లోకి, కళ్లలోకి దూరి ఇబ్బంది పెట్టడం వల్ల ఏనుగులు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. తేనెటీగల కంచెల ఏర్పాటుకు ఖర్చు తక్కువే కాకుండా ఏనుగులకు కూడా ఎటువంటి హానీ జరగదు. అంతేకాకుండా తెనెటీగల పెట్టెల ద్వారా తేని వస్తుంది కాబట్టి గ్రామీణులకు ఆదాయమూ లభిస్తుంది. పెద్ద కందకాలు తవ్వటం, సాధారణ కంచెలు ఏర్పాటు చేయటం వంటి చర్యల కన్నా తేనెటీగల కంచెలకు తక్కువ ఖర్చవుతుందని, ఫలితం బాగుందని కెవిఐసి తెలిపింది. పంటలను, రైతుల ప్రాణాలను కాపాడేందుకు ఈ తేనెటీగల కంచెల ఏర్పాటును ఏనుగులతో సమస్య ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని అప్పటి కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మల్బరీ ఆకులను ఏనుగులు ముట్టవు! అయితే, ఏనుగులు తినని పంటలను ఆయా ప్రాంతాల్లో కంచె పంటగా సాగు చేయటం ద్వారా వాటి రాకను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పూల పంటలను ఏనుగులు తినవు. కానీ, తొక్కి పాడు చేస్తాయి. ఏనుగులు తినని, పాడు చేయని పంటలేమైనా ఉన్నాయా? అని బెంగళూరులోని కేంద్రీయ ఔషధ–సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీమాప్) శాస్త్రవేత్తలు డా. ఆర్. రవి కుమార, డా. ఎన్.డి. యోగేంద్ర కర్నాటకలోని కావేరి వన్యప్రాణుల అభయారణ్యం బెల్ట్‌లో ఐదేళ్లు పరిశోధన చేశారు. మల్బరీ ఆకులను ఏనుగులు అసలు తినవని, ఈ చెట్ల జోలికి కూడా రాకుండా దూరంగా వెళ్లపోతున్నట్లు వారు కనుగొన్నారు. మల్బరీ మొక్కలను పట్టు పురుగులకు మేతగా వేస్తుంటాం. పండ్లలో పోషకాలు ఉంటాయి. లేత ఆకులు, కాండంతో రుచికరమైన కూర వండుకోవచ్చు. మల్బరీ ఆకుతో కషాయం చేసుకోవచ్చు. పశువులు, గొర్రెలు, మేకలు, కుందేళ్లకు మల్బరీ ఆకులను మేపవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది, ఈ ఆకుల్లో ప్రోటీన్ 15% నుండి 28% వరకు ఉంటుంది. అద్భుతమైన అమైనో ఆమ్లం ఉంటుంది. హానికరమైన పదార్థాలు లేవు. ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కాండం ముక్కను నాటితే చాలు. మొక్క వేగంగా పెరుగుతుంది. అయితే, ఇతర శాకాహార పశువులు ఇష్టంగా తినే మల్బరీ ఆకులకు ఏనుగులు మాత్రం ముట్టుకోవు. ఈ ఆకుల్లో మోరిన్ బి–సిటోస్టెరాల్ వంటివి ఉండటం వల్ల కావచ్చని సీమాప్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మల్బరీ సాగు మానవ–ఏనుగుల సంఘర్షణలను నియంత్రణలో ఉపయోగపడటంతో పాటు బహుళ ప్రయోజనాలతో కూడిన సుస్థిర జీవనోపాధిని అందిస్తుందని డా. రవి కుమార, డా. యోగేంద్ర సూచిస్తున్నారు. ఇలాఉండగా.. గ్రామీణాభివృద్ధి అధికారులు కోరితే సమస్యాత్మక గ్రామాల పొలిమేరల్లో ‘తేనెటీగల కంచె’ల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని విజయవాడలోని కేవీఐసీ డైరెక్టర్ డా. గ్రీప్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఆయన ఈ–మెయిల్: sohyderabad.kvic@gov.in – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఇంట్లో 10 లక్షల తేనెటీగలు ఉంటే ఎలా ఉంటుంది? ఈ గోళ ఏంటి?
మాంచి.. చెక్క ఇల్లు. చుట్టూ పచ్చని పొలం. ఆహ్లాదకరమైన వాతావరణం. సమయానికి ఫుడ్డు, పడుకోవడానికి బెడ్డు. వీటితోపాటు ఇంటి మధ్యలో పైన గ్లాస్ లాంటి డబ్బాలో దాదాపు 10 లక్షల వరకు తేనెటీగలు. ఎలా ఉంటుంది?.. అంటే అంతా బాగానే ఉంది కానీ.. మధ్యలో ఈ తేనెటీగలెందుకురా బాబూ అని అంటారు కదా! కానీ.. ఇటలీ, చుట్టుపక్కల దేశాల జనాలు మాత్రం ‘ఏమన్నా క్రియేటివిటా.. మేమొస్తాం. ఆ ఇంట్లో ఉంటాం’ అంటున్నారు. తేనెటీగలే ఈ ఇంటికి ప్రత్యేకత మరి! ఇటలీలో తేనెటీగలను పెంచే రోకో ఫిలోమెనో ఈ ఇంటిని నిర్మించాడు. ఈసారి మే 20న జరిగే ‘వరల్డ్ బీ డే’ సందర్భంగా ఈ సర్ప్రైజ్ ఇచ్చాడు. నచ్చిన వాళ్లు వెకేషన్‌కు ఈ ఇంటికి రావొచ్చంటూ.. ఎయిర్‌బీఎన్‌బీ వెబ్సైట్ (హాలీడేకి వచ్చే వాళ్లకు ఇళ్లను అద్దెకిస్తుంటుంది)లో ఇంటిని లిస్ట్ చేశాడు. వామ్మో తేనెటీగలు కుడితేనో అని భయపడకండి.. అవి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు లెండి. ఈ చెక్క ఇంటిపైన కట్టిన గాజు బాక్సులో తేనెటీగలు కనిపిస్తుంటాయి. అవి చేసే శబ్దాన్ని వింటూ, అవి తమ కాలనీని ఎలా నిర్మించుకుంటున్నాయో చూస్తూ సందర్శకులు హాయిగా నిద్రపోవచ్చు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ దక్షిణ ఇటలీలో.. దక్షిణ ఇటలీలోని గ్రొట్టోల్లో ఉన్న తన ఆలివ్ పొలంలో ఈ తేనెటీగల ఇంటిని రోకో నిర్మించాడు. డేవిడ్ టాగ్లియాబు అనే ఆర్టిస్టు ఇంటిని డిజైన్ చేయగా నిర్మాణానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులను రోకో సమకూర్చాడు. స్థానిక వలంటీర్లు కూడా ఓ చెయ్యేశారు. పూర్తిగా కలప (ఫిర్, బిర్చ్ వుడ్)తో ఇంటిని నిర్మించారు. నిర్మాణానికి దాదాపు రూ. 13 లక్షలు ఖర్చయిందట. ఈ ఇంటిని బుక్ చేసుకున్న వాళ్లు రికోట్టా, స్ట్రాబెర్రీలు, ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లతో పాటు తేనె రుచిని కూడా ఆస్వాదించొచ్చు. -
వెరైటీ దొంగలు.. డబ్బు, బంగారం వద్దు.. అవే కావాలి..పట్టుకుంటే 10 వేల డాలర్లు!
సాధారణంగా దొంగలంటే డబ్బో లేక బంగారమో దోచుకుంటుంటారు. దాదాపుగా ఎక్కడైనా జేబులు కొట్టే వాళ్లు మొదలు.. ఇళ్లను కొల్లగొట్టే వాళ్ల వరకు రకరకాల చోరశిఖామణులు ఉంటారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రం వెరైటీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రికిరాత్రే ‘సొత్తు’ను కొల్లగొడుతూ స్థానికులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు చేసే ‘కటింగ్’ ఏమిటో తెలుసా? తేనెటీగల చోరీ..!! వెంటాడి మరీ కుట్టికుట్టి పెట్టే తేనెటీగలను దొంగలు అమాంతం ఎత్తుకుపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..! అందుకే మరి దీన్ని వెరైటీ చోరీ అంటున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే.. కాలిఫోర్నియా రకం బాదంపప్పు గురించి మీకు తెలుసుగా.. వాణిజ్య స్థాయిలో యావత్ అమెరికాకు అవసరమయ్యే 100 శాతం బాదంపప్పును ఈ రాష్ట్రమే సరఫరా చేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే బాదంలో 80 శాతం కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇంత భారీ స్థాయిలో బాదం సాగు జరగాలంటే అందుకు పరపరాగ సంపర్కం అవసరం. ఈ విషయంలో తేనెటీగలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే బాదం తోటల్లో తేనెటీగలు వేర్వేరు చెట్లపై వాలుతూ పుప్పొడిని తరలించే వాహకాలుగా మారి వాటి ఫలదీకరణకు దోహదపడుతుంటాయి. ఇందుకోసం ఏటా కాలిఫోర్నియాలోని బాదం రైతులు తేనెటీగల పెంపకందారుల నుంచి వాటిని అద్దెకు తెచ్చుకుంటుంటారు. తేనెటీగలతో కూడిన ఒక్కో కృత్రిమ తేనెతుట్టె అద్దె 210 డాలర్లు (సుమారు రూ. 15,800)గా ఉంటుంది. దీన్ని పసిగట్టిన చోరులు... ఈ సీజన్లో పెంపకందారులు కృత్రిమ తేనెతుట్టెల్లో సిద్ధంగా ఉంచే వేలాది డాలర్ల విలువైన తేనెటీగలను ఎత్తుకుపోతున్నారట! వాటిని అధిక ధరలకు బాదం రైతులకు అమ్ముకుంటూ లక్షాధికారులైపోతున్నారట!! పట్టుకుంటే 10 వేల డాలర్లు.. గత నెలలో ఇలాగే కొందరు దొంగలు ఓ ఫారంలోని లక్షలాది తేనెటీగలను రాత్రికిరాత్రే మాయం చేయడంతో అప్రమత్తమైన కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం దొంగలను పట్టిచ్చే వారికి ఏకంగా 10 వేల డాలర్ల (సుమారు రూ. 7,50,000) నజరానా ప్రకటించింది!! అయినా వాటిలో కొన్ని తుట్టెలే చివరకు దొరికాయట. కొందరు పెంపకందారులైతే ఒక అడుగు ముందుకేసి తమ కృత్రిమ తేనెతుట్టెలు చోరీకి గురైతే సులువుగా గుర్తించేందుకు వాటికి ముందుగానే జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను అమరుస్తున్నారట! కారణం ఏమిటి? అమెరికన్లు తినే మూడో వంతు ‘ఆహారం’తయారీ తేనెటీగలు, సీతాకోకచిలుకలు, గబ్బిలాల వంటి వాటిపైనే ఆధారపడి ఉందని అమెరికా వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే గత 50 ఏళ్లుగా అమెరికాలో తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతోందని పేర్కొంటోంది. ఒక్క 2006లోనే దేశంలోని ఏకంగా 30 శాతం తేనెటీగలు నశించాయని తెలిపింది. పంట రసాయనాల వాడకం అధికం కావడం, వ్యాధులు, పౌష్టికాహారలేమి ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తోంది. మరోవైపు తేనెటీగల పెంపకం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేపట్టాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకసారి చోరీకి తేనెటీగలు చోరీకి గురైతే మళ్లీ నాణ్యమైన, కొత్త వాటిని పెంచేందుకు ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే చోరుల కన్ను వీటిపై పడిందని అంటున్నారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
వైరల్ వీడియో: బాహుబలి తేనేటీగలు
తేనేటీగలు తమ శక్తికి మించిన పని చేసి బాహుబలిని తలపించాయి. రెండు తేనేటీగలు కలిసి ఫాంటా కూల్‌డ్రింక్ బాటిల్‌ని ఓపెన్ చేశాయి. బాటిల్ మూతకి రెండు వైపులా చేరో తేనటీగ వాలి... నెమ్మదిగా మూతని తెరిచి ఫాంటాని చప్పరించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. Two bees opening a soda bottle together.. 😲 #repost pic.twitter.com/Kv8nJrwxJD — Buitengebieden (@buitengebieden_) May 26, 2021 -
ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్ ఫోటో షూట్.. వీడియో వైరల్
Angelina Jolie: హీరోయిన్లు ఫోటో షూట్లో పాల్గొనడం సర్వసాధారణం. అందుకోసం గ్లామర్ షో చేయడం కూడా కొత్తేమి కాదు. పోటీ ప్రపంచంలో తోటి హీరోయిన్లను తట్టుకొని సీనీ ఇంటస్ట్రీలో ముందుకు సాగాలంటే అప్పుడప్పుడు వెరైటీ ఫోటో షూట్లు చేయడం తప్పనిసరి. అందుకే నేటితరం నటీమణులు ఫోటో షూట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ట్రెండ్‌కి తగ్గటు డ్రెస్సింగ్ స్టైల్‌ని మారుస్తూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతూ.. సినీ అవకాశాలు చేజిక్కుంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన ఫోటో షూట్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటో షూట్ ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటి నటి ఏంజెలీనా జోలి ఒంటి నిండా తేనెటీగలతో ఫోటో షూట్లో పాల్గొంది. దాదాపు 18 నిమిషాల పాటు తేనెటీగలను తన శరీరంపై ఉంచుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఈ సాహసం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? అవి కుడితే ఆమె పరిస్థితి ఎలా ఉండేదని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ సందేహాలపై ఫోటోగ్రాఫర్ బీకీపర్స్ డాన్ వింటర్స్ క్లారిటీ ఇచ్చాడు. తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ సహకారంతో ఈ ఫోటో షూట్ చేశామని తెలిపారు. ఈ షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను ఉపయోగించారని.. అలాగే సెట్లో ఉన్న సిబ్బంది రక్షణ కోట్స్ ధరించారని.. కేవలం ఏంజెలీనాకు మాత్రమే సూట్ వేయలేదని చెప్పారు. అలాగే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి సెట్ లో నిశ్శబ్ధం.. చీకటిగా ఉండేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ‘ఈ ఫోటో షూట్ కోసం.. కీటక శాస్త్రవేత్త అయిన అవెడాన్ నుంచి అనుమతి తెచ్చుకున్నాము. ఏంజెలీనా దీని కోసం చాలా రిస్క్ చేసింది’ అంటూ డాన్ వింటర్స్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Dan Winters (@danwintersphoto) -
తేనెటీగలను చెదరగొట్టబోయి వ్యక్తి సజీవ దహనం
మక్తల్: బస్సుల్లో చేరిన తేనెటీగలను చెదరగొట్టేందుకు నిప్పు పెట్టడంతో మూడు బస్సులు దగ్ధం కావడమేగాక, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన మూడు బస్సులను నిర్వాహకులు ఏడాది కాలంగా స్కూల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఉపయోగంలో లేకపోవడంతో వాటిలో తేనెటీగలు చేరాయి. దీనిని గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ స్థానికులైన బుడగజంగాలు మహదేవ్ (46), గోపీకి వాటిని తొలగించాలని సూచించారు. దీంతో వారిద్దరూ శనివారం సాయంత్రం కొబ్బరికొమ్మను కాల్చి బస్సులో మంటబెట్టారు. తేనెటీగలు చెల్లాచెదురుకాగా ఒక్కసారిగా మంటలు రేగి బస్సులు దగ్ధమయ్యాయి. అందులో చిక్కుకున్న మహదేవ్ సజీవ దహ నం కాగా, గోపీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కలవారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రాము లు పరిశీలించి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బుజ్జమ్మ విలేకరులతో మాట్లాడుతూ, స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేయడంతోనే తన భర్తతో పాటు మరో వ్యక్తి అక్కడికి వెళ్లి తేనెతుట్టెను రాల్చారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. చదవండి: సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్లో మంటలు -
ఒళ్లంతా తేనెటీగలతో.. షాకింగ్ వీడియో
ఒక్క తేనెటీగ కుట్టిందంటేనే దద్దుర్లు వచ్చి భరించనేంత నొప్పి కలుగుతుంది. అలాంటిది వందలు కాదు, వేలు కాదు దాదాపు ఆరు లక్షలకు పైగా తేనెటీగలు కుడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే చాలా విడ్డూరంగా ఉంది కదూ.. కానీ చైనాకు చెందిన రువాన్ లియాంగ్మింగ్ అనే వ్యక్తి మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. అంతేకాకుండా తేనెటీగలు కుడుతున్నంతసేపు అసలు తన చుట్టూ ఏమీ జరగనట్లు ఎంతో శాంతంగా కనిపిస్తున్నాడు. 2016లో జరిగిన ఈ విస్మయం కలిగించే వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు త్రో బ్యాక్ వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఈ కారు మనసులు దోచేయడం ఖాయం ) దాదాపు 637,000కు పైగానే ఉన్న తేనెటీగలు ఉన్నాయని, ఇది చూస్తుంటే లియాంగ్మింగ్కి తేనేటీగలపై ఎంత ప్రేమో అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియో లేటెస్ట్ పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు టన్నుల కొద్దీ లైకులు, షేర్లతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది చాలా అమేజింగ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ.. లక్షల కొద్దీ తేనెటీగలు కుట్టినా అతనికి ఏమీ కాకుండా ఎలా ఉన్నాడు? మనకు చిన్న చీమ కుట్టినా తెగ నొప్పి పుడుతుంది కదా అంటారా..ఇది ఏ ఒక్కరోజులోనో జరిగే ప్రక్రియ కాదు. దీని వెనుక కొన్నేళ్ల శ్రమ ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా తేనేటీగలతో వ్యవహరించేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు. (వైరల్ వీడియో.. వేడి నూనెతో మహిళ సాహసం ) -
ఆమె కంట్లో తేనెటీగలు.!
-
మేలు చేసిన తేనెటీగ
సారంగపురంలో జనాభా పెరిగిపోయింది. నగరంలో పెద్ద భవనాలు, విద్యాసంస్థలు వెలిశాయి. రాజుగారి రథాలు, మంత్రిగారు సహా రాజ పరివారానికి చెందినవారి రథాలు, ఇతర సంపన్నుల రథాలు పోవాలంటే నగరంలోని వీధులు ఇరుకు కాసాగాయి. రహదారులను విశాలంగా తయారు చేయడానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టించేయాలని రాజుగారి మంత్రిమండలి నిర్ణయించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా! శరవేగంగా చెట్లు కొట్టే కార్యక్రమాన్ని అమలు చేయసాగారు. చిరకాలంగా నగర పౌరులకు నీడనిచ్చిన భారీ వృక్షాలు నేలకొరిగాయి. పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపించే రహదారులు బోసిపోయాయి. నగరంలోనే నివాసం ఉంటున్న పుష్పరాజుకు చెట్లంటే వల్లమాలిన ప్రేమ. పుష్పరాజు నగరంలోని అనేక రహదారుల వెంబడి ఎన్నో చెట్లు నాటించాడు. పుష్పరాజు ఇంటి దగ్గర్లోనే ఉన్న మూడు పెద్ద వృక్షాలను కూడా రాజుగారి సిబ్బంది కొట్టివేశారు. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగిన పుష్పరాజు, నేలకొరిగిన ఆ వృక్షాలను చూసి చాలా బాధపడ్డాడు. ఇదివరకు పచ్చగా కళకళలాడే ప్రదేశం బోసిపోయి కనిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే, నగరానికి దూరంగా వెళ్లి ఒక పెద్దస్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని, చక్కని తోట వేసుకోవాలనుకున్నాడు. నగరానికి దూరంగా ఒక తటాకం పక్కన కనిపించిన స్థలం అనువైనదిగా అనిపించడంతో అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చుట్టూ బోలెడన్ని పండ్లు, కూరగాయల మొక్కలు వేశాడు. పూల మొక్కలు వేశాడు. తటాకానికి కొద్ది దూరంలోనే ఒక పెద్ద వృక్షం కూడా ఉంది. రోజూ తటాకం నుంచి నీళ్లు తెచ్చి శ్రద్ధగా తోటలోని మొక్కలకు పోయసాగాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని వృక్షాలుగా ఎదిగాయి. అవి పూలు, పండ్లు, కూరగాయలు ఇవ్వసాగాయి. ఆ అందమైన పూల సువాసన అల్లంత దూరంలో ఎగురుతున్న తేనెటీగను ఆకర్షించింది. అది ఎంతో సంతోషంతో తోటను గమనించింది. ఇంతకుముందు తేనె సేకరించాలంటే ఎంతో దూరం పోవాల్సి వచ్చేది. ఇంత అందమైన దృశ్యాన్ని ఆ తేనెటీగ ఇంతకు ముందు చూసి ఎరుగదు. అక్కడ దూరంగా ఉన్న తేనెటీగలు కూడా పూల సువాసనను గ్రహించాయి. కొద్ది దూరంలోనే ఉన్న పెద్ద చెట్టు మీద తేనెటీగలు తేనెపట్టు పెట్టాయి. అవి రోజూ పుష్పరాజు తోటలోని పూల నుంచి మకరందాన్ని సేకరించి తమ తేనెపట్టును నింపసాగాయి. పుష్పరాజు తోటలోని మకరందాన్ని సేకరిస్తున్నాయి కనుక అవి పుష్పరాజుకు ఏదైనా మేలు చేయాలని తలచాయి. అదలా ఉండగా, దూరంగా ఉన్న అడవి నుంచి ఒక తోడేలు పుష్పరాజు ఇంటి వైపు రాసాగింది. అప్పుడే పుష్పరాజు కొడుకు చెక్కతో చేసిన చిన్న బొమ్మతో ఆడుకుంటూ తోటలోకి వచ్చాడు. తోడేలు పుష్పరాజు కొడుకు వైపు రాసాగింది. తోడేలు వల్ల ఆ బాలుడికి ఎదురవబోయే ప్రమాదాన్ని గ్రహించిన పెద్ద తేనెటీగ మిగిలిన తేనెటీగలను వెంటనే అప్రమత్తం చేసింది. అంతే! అవి గుంపుగా బయలుదేరి పుష్పరాజు కొడుకు వైపు వస్తున్న తోడేలుపై మూకుమ్మడిగా దాడి చేశాయి. తేనెటీగల కాటుకు తోడేలుకు ఒళ్లంతా బాగా వాచిపోయింది. తేనెటీగల కాట్ల ధాటికి ఒళ్లంతా మంటలు పుట్టడంతో ఆ బాధ భరించలేక కుయ్యో మొర్రో అంటూ ఆ తోడేలు దూరంగా ఉన్న అడవిలోకి పారిపోయింది. ఇక ఆ రోజు నుంచి తోడేలు పుష్పరాజు తోట దరిదాపులకు వచ్చేందుకైనా సాహసించలేదు. పుష్పరాజు తోటలోని మకరందాన్ని గ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా తేనెటీగలు అతడి కొడుకును తోడేలు బారి నుంచి కాపాడాయి. తోడేలు పాదాల గుర్తులు గమనించి పుష్పరాజు ఇంటి చుట్టూ పెద్ద దడి కట్టించి, తన ఇంటికీ, కుటుంబానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు. మరిన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలను తీసుకొచ్చి తన తోటను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నాడు. -
తేనెటీగల స్థానంలో డ్రోన్లు!
క్రిమిసంహారక మందుల కారణంగా తేనెటీగలు ఏటికేడాదీ అంతరించిపోతున్నాయి. పూల పుప్పొడి తోట అంతా విస్తరించేలా చేసి ఫలదీకరణకు సాయపడే తేనెటీగలు తగ్గిపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని రైతులు ఇప్పటికే గుర్తిస్తున్నారు. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? చాలా సింపుల్ అంటోంది న్యూయార్క్ కంపెనీ డ్రాప్‌కాప్టర్. తేనెటీగల సైజులో కాకున్నా ఓ మోస్తరు సైజుండే డ్రోన్లతో పుప్పొడిని వ్యాపింపచేయవచ్చును అంటోంది ఈ కంపెనీ. ఈ మధ్యే డ్రాప్‌కాప్టర్ డ్రోన్లు అమెరికాలోని ఓ ఆపిల్ తోటలో చెట్లకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఎగురుతూ పుప్పొడిని వెదజల్లాయి. ఇది తేనెటీగల స్థాయిలో సమర్థంగా పనిచేసిందా? లేదా? అన్నది తేలాలంటే దిగుబడి వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. అయితే డ్రోన్లు ఎంత బాగా పనిచేసినప్పటికీ అవి తేనెటీగలకు సాటికాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. డ్రాప్‌కాప్టర్ డ్రోన్లు సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపవచ్చునేమోగానీ.. తేనెటీగలను పరిరక్షించుకోవడం దీని కంటే ముఖ్యమైన విషయమని అంటున్నారు వారు. -
తేనెటీగలను రక్షించేందుకు కీటకనాశినులపై నిషేధం!
తేనెటీగలు అంతరించిన కొన్ని రోజులకు భూమి మీద మనిషనేవాడు మిగలడని ఐన్‌స్టీన్ అంతటి శాస్త్రవేత్త వందేళ్ల క్రితమే హెచ్చరించాడు. అయితే క్రిమికీటకనాశినుల వాడకం పెరుగుతున్నకొద్దీ ఈ అద్భుతమైన తేనెటీగల సంతతి తక్కువైపోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోని అన్ని దేశాల్లోనూ కీటకనాశినులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నియోనికొటినాయిడ్స్ అనే రసాయనాలు తేనెటీగలు వేగంగా అంతరించిపోతున్నట్లు ఇప్పటికే గుర్తించారు. కీటకనాశినులపై నిషేధం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి వస్తుందని అంచనా. అనాదిగా మనం తినే ఆహారంలో ఎక్కువభాగం తేనెటీగలు చేసే పని వల్ల సమకూరుతోందన్నది మనందరికీ తెలిసిందే. రెండేళ్లక్రితం అమెరికా ప్రభుత్వ సంస్థ ఒకటి తేనెటీగలను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది. కీటక నాశినులపై నిషేధం విధిస్తే పంటలు ఎలా కాపాడుకోవాలన్న అనుమానం కొందరికి రావచ్చు. కొన్ని రసాయనాల్లో నియోనికొటినాయిడ్ రసాయనం ఉన్నప్పటికీ అవి తేనెటీగలపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని తెలిసింది. ఈ రకమైన రసాయనాల వాడకం ద్వారా అటు తేనెటీగలను సంరక్షించుకుంటూనే.. ఇటు పంటలనూ కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
ఫారిన్ మొక్కలతో లోకల్ తేనెటీగలకు ముప్పు!
చాలామంది అరుదైన పూల మొక్కలను పెరటితోటల్లో పెంచడానికి ఆసక్తి చూపుతుంటారు. తోటపని మీద అభిరుచి ఉన్నవారు కొత్త కొత్త మొక్కలను సేకరించి, పెరటితోటల్లో పెంచుతుంటారు. పెరటితోటల్లో అలా పెంచే మొక్కలు స్థానిక జాతులకు చెందినవైతే ఫర్వాలేదు గాని, ఎక్కడివో విదేశీ మొక్కలను తెచ్చి పెంచితే మాత్రం తేనెటీగల మనుగడకే అవి ముప్పుగా పరిణమించగలవని బ్రిటిష్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్థానిక వాతావరణంలో సహజంగా పెరిగే మొక్కల నుంచి సేకరించే తేనెకు తేనెటీగలు తరతరాలుగా అలవాటు పడి ఉంటాయని, విదేశీ మొక్కల నుంచి సేకరించే తేనె వాటి జీర్ణప్రక్రియకు సమస్యలు తెచ్చి పెడుతుందని ‘గ్రీన్‌పీస్’ సంస్థ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధన జరిపిన బృందానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఫిలిప్ డాంకెర్స్లీ చెబుతున్నారు. బ్రిటన్‌లో కొందరు తమ తోటల్లో దక్షిణ అమెరికా, ఆసియా దేశాలకు చెందిన పూల మొక్కలను పెంచుతూ ఉంటారని, అలాంటి పూలతోటలు ఉన్నచోట జరిపిన పరిశోధనల్లో వాటి పరిసరాల్లోని తేనెటీగలు జీర్ణాశయ సమస్యలతో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. -
తేనెటీగల దాడిలో సబ్‌కలెక్టర్‌కు గాయాలు
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడులోని బొగత జలపాతాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్, టూరిజం ఈఈ సహా పలువురికి గాయాలయ్యాయి. జలపాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు కలెక్టర్ మురళి, సబ్ కలెక్టర్ గౌతమ్, టూరిజం ఈఈలతో కలిసి గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అధికార బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్ గౌతమ్‌కు చెవి, ముక్కు, గొంతు ప్రాంతాల్లో గాయాలయ్యాయి. అధికారులతో పాటు అక్కడ ఉన్న పర్యటకులపై కూడా తేనెటీగలు విరుచుకుపడటంతో.. భయంతో పరుగులు తీశారు. -
టెక్ తేనెటీగలు
‘‘ఈ భూమ్మీద తేనెటీగలు మాయమైపోతే ఆ తరువాత నాలుగేళ్లలో మనిషన్న వాడు కూడా లేకుండా పోతాడు’’... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసినట్టుగా చెబుతున్న ఈ వ్యాఖ్య అక్షర సత్యం. మొక్కల్లో పరపరాగ సంపర్కానికి ఇవే కీలకమని మనమూ చదువుకున్నాం. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తేనెతుట్టెలు, తేనెటీగలు కరవైపోతున్నాయి. రసాయనిక క్రిమి, కీటక నాశినులను ఈ చిన్ని ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయి. నిజమేగానీ... ఇప్పుడీ విషయమంతా ఎందుకు అంటే... ఈ ఫొటోలు చూసేయండి!. పువ్వు మధ్యలో ఓ బుల్లి డ్రోన్ కనిపిస్తోందా... అది కూడా ఓ తేనెటీగ వంటిదే. కాకపోతే జీవంతో కాకుండా బుల్లి మోటార్‌తో నడుస్తుంది. ఇది అచ్చం తెనెటీగల మాదిరిగానే పూల పుప్పొడిని అటు ఇటూ మార్చేస్తుందట కూడా. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ వీటిని డిజైన్ చేసింది. రెండంటే రెండు అంగుళాల సైజుండే డ్రోన్ అడుగు భాగంలో జంతువుల వెంట్రుకలు కొన్ని అతికించారు. ఈ వెంట్రుకలకు కొంత జిగురు కూడా జోడించడంతో వాలిన ప్రతి పువ్వు నుంచి ఇది పుప్పొడిని సేకరించగలదు. ఆ తరువాత ఇంకో పువ్వుపై రాలితే చాలు... కాగల కార్యం అయిపోయినట్లే! అయితే ప్రస్తుతానికి ఈ డ్రోన్లను వాడే అవకాశాలు లేవని, జీపీఎస్, కృత్రిమ మేధ వంటి కొన్ని ఇతర హంగులను జోడించాల్సి ఉందని అంటున్నారు వీటిని సృష్టించిన శాస్త్రవేత్త ఇజిరో మియాకో! అంతేకాకుండా ఈ డ్రోన్లు పూల లోపల పాక్కుంటూ కదిలేందుకు సూక్ష్మస్థాయి యంత్రాలు కూడా అవసరమవుతాయని, మరింత స్పష్టమైన చిత్రాలు తీయగల చిన్న చిన్న కెమెరాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అంటున్నారు ఆయన. నశించి పోతున్న తేనెటీగలకు ప్రత్యామ్నాయంగా డ్రోన్లను వాడాలన్న మియాకో ఐడియా బాగానే ఉన్నప్పటికీ ఇందుకు అభ్యంతరపెట్టే వారూ లేకపోలేదు. ప్రపంచం మొత్తమ్మీద ప్రస్తుతం దాదాపు 3.2 లక్షల కోట్ల తేనెటీగలు ఉన్నాయి అనుకుంటే.. అవి తమనుతాము పోషించుకుంటూ మనిషికి ‘తేనె’ను అందిస్తున్నాయని, యంత్రాలు ముమ్మాటికీ ఆ పని చేయలేవని అంటున్నారు ససెక్స్ విశ్వవిద్యాలయ బయాలజిస్ట్ డేవిడ్ ఘాల్సన్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మకరందం... జుర్రేస్తాం
-
మకరందం... జుర్రేస్తాం
తుమ్మెదలు వివిధ పూల నుండి మకరందాన్ని జుర్రుకుంటున్నాయి. వర్షా కాలంలో వివిధ రకాల పూలు విరభూస్తాయి. ఏడాదికి ఒక్కసారి పూసే పూలంటే తుమ్మెదలకు ఎంతో ఇష్టం. వాటి మకరందాన్ని అమృతంలాగా లాగేస్తున్నాయి. కె.సతీష్, సాక్షి ఫోటోగ్రాఫర్, సంగారెడ్డి -
భక్తులపై తేనెటీగల దాడి: 15మందికి గాయాలు
చిత్తూరు: గంగమ్మ గుడికి దర్శనానికి వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తానా చెక్‌పోస్టు వద్ద గంగమ్మ గుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో 15 మంది భక్తులకు గాయాలయినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!
లాస్ ఏంజెల్స్: అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తానని అంటోంది.. హాలివుడ్ నటి గ్వైనెత్ పాల్త్రోవ్. తాజాగా ఆక్యుపంక్చర్‌లో భాగంగా తేనెటీగలతో డజన్ల సార్లు కుట్టించుకున్నానని చెప్పిందీ భామ. అంతేకాదు తనను తాను గినియా పందితో పోల్చుకున్న ఈ ఆస్కార్ విన్నర్ ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్దంగా ఉంటానంటోంది. తేనెటీగలతో తీసుకునే ఈ చికిత్స వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉందని తెలిపింది. ఎపిథెరపీగా పిలిచే ఈ చికిత్సను చర్మం మీద మచ్చలను తగ్గించుకునేందుకు చేయించుకుంటారని, అయితే.. ఈ చికిత్స చేయించుకోవడానికి చాలా ధైర్యం, నొప్పిని భరించగల శక్తి ఉండాలని చెప్పింది 43 ఏళ్ల పాల్త్రోవ్. కీళ్ల నొప్పులు, వాపు, చర్మం మీద ఎర్రగా కనిపించడం, రక్తప్రసరణను పెంచడానికి ఆక్యుపంక్చర్ బాగా ఉపయోగపడుతుంది. -
పాఠశాల విద్యార్థులపై తేనెటీగల దాడి
నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు శివారులోని కృష్ణవేణి స్కూల్ విద్యార్థులపై గురువారం ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. స్కూల్ సమీపంలో చెట్టుపై ఉన్న తేనెతుట్టెను కదిలించడంతో తేనెటీగలు పాఠశాల వైపు వచ్చి నలుగురు విద్యార్థులు, కరస్పాండెంట్‌పై దాడి చేసి తీవ్రంగా కుట్టాయి. దీంతో యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.