పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద పర్యాటకులపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. వారిని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని బృందావన్ కాలనీకి చెందిన 44 మంది కిన్నెరసాని రిజర్వాయర్‌ను చూసేందుకు ఈ రోజు ఉదయం వచ్చారు. రిజర్వాయర్‌ను చూసి వెళుతుండగా బ్రిడ్జి కింద ఉన్న తేనె తుట్టెపై కొందరు రాళ్లు రువ్వడంతో అవి పర్యాటకులపై దాడి చేశాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్సత్రి కి తరలించారు
పర్యాటకులపై తేనెటీగల దాడి: 22 మందికి గాయాలు
Published Sat, Oct 17 2015 1:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM
Advertisement
Advertisement