అచ్చం తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలు..ప్రత్యేకతలివే | Rises Of The Robot Bees Which Used To Support Real Life Ecosystem | Sakshi
Sakshi News home page

Robot Bees: అచ్చం తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలు..ప్రత్యేకతలివే

Published Tue, Jul 18 2023 4:31 PM | Last Updated on Tue, Jul 18 2023 5:34 PM

Rises Of The Robot Bees Which Used To Support Real Life Ecosystem - Sakshi

అచ్చం తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలు..ప్రత్యేకతలివే

కొన్ని రకాల పంటలు, పండ్ల తోటల్లో పరపరాగ సంపర్యానికి అత్యవసరమైన తేనెటీగల సంఖ్య ప్రకతిలో అంతకంతకూ తగ్గిపోతుండంతో అగ్రిటెక్‌ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి.ఇజ్రాయెల్‌కి చెందిన ‘బ్లమ్‌ఎక్స్‌’ కంపెనీ తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలను రూపొందించింది.

పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలను పూర్తిచేసుకున్న రోబో తేనెటీగ యంత్రాలు (రోబో–బీలు/రోబీలు) మెక్సికో, పెరూ తదితర దేశాల్లోని బ్లూబెర్రీ, అవకాడో(వెన్నపండు) పండ్ల తోటల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పంటల అవసరాలను బట్టి ప్రత్యేక రోబీలను రూపొందిస్తుండటం విశేషం. 

రసాయనిక సాంద్ర వ్యవసాయ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) గణాంకాల ప్రకారం.. సాగు భమి విస్తీర్ణం 1961 తర్వాత 600% పెరిగితే, ఇదే కాలంలో పెట్టెల్లో తేనెటీగల పెంపకం 83% మాత్రమే పెరిగింది. కాలిఫోర్నియా(అమెరికా)లో విస్తారంగా సాగవుతున్న బాదం తోటల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరిపించేందుకు విదేశాల నుంచి ఏకంగా ఏడాదికి 4,800 కోట్ల తేనెటీగలను దిగుమతి చేసుకుంటున్నారు.

అక్కడ పని పూర్తయ్యాక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ప్రయాణంనే కోట్లాది తేనెటీగలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశ సరిహద్దులు దాటి తేనెటీగల దిగుమతిలో పర్యావరణ సమస్యలున్నాయి. ఈ సమస్యలను అధిగమిస్త.. తేనెటీగల కొరతను రోబో తేనెటీగలతో ‘బ్లూమ్‌ఎక్స్‌’ తీర్చే ప్రయత్నం చేస్తోంది. 

బ్లూబెర్రీ తోటల్లో ‘రోబీ’ రొద
ఇజ్రాయెల్‌లోని ఓ చిన్న వ్యవసాయ గ్రామం రిష్పన్‌లో బ్లమ్‌ఎక్స్‌ 2019లో ఏర్పాటైంది. సీఈఓ థాయ్‌ సదెది అదే ఊరు. ఇప్పటికైతే బ్లబెర్రీ, అవకాడో పంటల కోసం వేర్వేరుగా ప్రత్యేక ‘రోబో–బీ’ యంత్రాలను రూపొందించింది. ఈ రెండంది. ఈ రెండూ దిగుబడి పెంచితే రైతుల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉన్న ఖరీదైన పంటలు. అందుకే వీటిని ఎంపికచేసుకున్నామన్నారు బ్లూమ్‌ఎక్స్‌ ప్రతినిధి ఎమిలీ స్పీసర్‌.  బ్లబెర్రీ చెట్ల పూలల్లోనే ఆడ, మగ భాగాలుంటాయి.

అయితే, పుప్పొడి ఆడ భాగాలకు చేరాలంటే తేనెటీగలు మగ భాగాలను స్పృశించి మంద్రంగా కదపాల్సి ఉంటుంది. ఈ పని అనేక దఫాలు జరిగితేనే చక్కటి దిగుబడి వస్తుంది. సరిగ్గా జరగకపోతే పండ్ల సంఖ్యతోపాటు సైజు కూడా తగ్గిపోతుంది. కాబట్టి, బ్లబెర్రీ చెట్ల వరుసల మధ్య నుంచి రోబోను మనిషి నడుపుతూ తీసుకెళ్తుంటే.. రోబో తన చేతులు చాచి పూలను తగుమాత్రంగా చురుగ్గా కదుపుతూ పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది. దీన్ని ‘రోబీ’ అంటున్నారు. 

కృత్రిమ మేధ సాయం
ఏయే తోటల్లో పొలినేషన్‌ సేవలు ఎప్పుడు అవసరమో తెలుసుకోవటం కోసం డేటాబేస్‌లను కృత్రిమ మేధతో మేళవించే మొబైల్‌ అప్లికేషన్‌ను రైతులకు కంపెనీ అందిస్తోంది. అవకాడోలు, బ్లబెర్రీలు ఎక్కువగా సాగయ్యే మెక్సికో, పెర, కొలంబియా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లో రైతులు ఈ ‘రోబీ’లను వాడుతున్నారు. దిగుబడి బ్లబెర్రీలో 30%, అవకాడోలో 40% పెరిగిందట.

అవకాడో తోటలో ‘క్రాస్‌బీ’అవకాడో ఎత్తు పెరిగే చెట్లు. ఈ చెట్లకు ఆడ, మగ పూలు పూస్తాయి. అయితే, మగ పూలు విచ్చుకున్న కొద్ది గంటల తర్వాత గానీ ఆడ పూలు విచ్చుకోవు. మగ పూలను తాకిన తేనెటీగలకు పుప్పొడి రేణువులు అంటుకుంటాయి. కొన్ని గంటల తర్వాత ఆడ పూలను తేనెటీగలు తాకినప్పుడు ఆ పుప్పొడి ఈ పూలకు అంటడం వల్ల పరపరాగ సంపర్కం సజావుగా సాగుతుంది. ఈ అవసరాలకు అనుగుణంగా పరపరాగ సంపర్కం జరిపేందుకు ‘క్రాస్‌బీ’ పేరుతో బ్యాడ్మింటన్‌ బ్యాట్‌ మాదిరి చేతి రోబో పరికరాన్ని బ్లమ్‌ఎక్స్‌ రపొందింంది.

దీనితో పువ్వులపై సున్నితంగా రుద్దితే పుప్పొడి దానికి అంటుతుంది. ఆ పుప్పొడిని సేకరిం భద్రపరుస్తారు. కొన్ని గంటల తర్వాత ఆడ పూలు విచ్చుకున్నప్పుడు రోబో చేతితో ఈ పుప్పొడిని ఆ పూలకు సున్నితంగా రుద్దుతారు. ఈ విధంగా విజయవంతంగా పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు రుజువైందని సంస్థ తెలిపింది. వేర్వేరు రకాల అవకాడో చెట్లను పక్కపక్కనే నాటితే.. అప్పటికప్పుడే పరపరాగ సంపర్కం జరిగిపోతుంది. పుప్పొడిని భద్రపర, తర్వాత వినియోగించాల్సిన అవసరం ఉండదని సంస్థ వివరింంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement