ఒక్క తేనెటీగ కుట్టిందంటేనే దద్దుర్లు వచ్చి భరించనేంత నొప్పి కలుగుతుంది. అలాంటిది వందలు కాదు, వేలు కాదు దాదాపు ఆరు లక్షలకు పైగా తేనెటీగలు కుడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే చాలా విడ్డూరంగా ఉంది కదూ.. కానీ చైనాకు చెందిన రువాన్ లియాంగ్మింగ్ అనే వ్యక్తి మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. అంతేకాకుండా తేనెటీగలు కుడుతున్నంతసేపు అసలు తన చుట్టూ ఏమీ జరగనట్లు ఎంతో శాంతంగా కనిపిస్తున్నాడు. 2016లో జరిగిన ఈ విస్మయం కలిగించే వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు త్రో బ్యాక్ వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఈ కారు మనసులు దోచేయడం ఖాయం )
దాదాపు 637,000కు పైగానే ఉన్న తేనెటీగలు ఉన్నాయని, ఇది చూస్తుంటే లియాంగ్మింగ్‌కి తేనేటీగలపై ఎంత ప్రేమో అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియో లేటెస్ట్ పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు టన్నుల కొద్దీ లైకులు, షేర్‌లతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది చాలా అమేజింగ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ.. లక్షల కొద్దీ తేనెటీగలు కుట్టినా అతనికి ఏమీ కాకుండా ఎలా ఉన్నాడు? మనకు చిన్న చీమ కుట్టినా తెగ నొప్పి పుడుతుంది కదా అంటారా..ఇది ఏ ఒక్కరోజులోనో జరిగే ప్రక్రియ కాదు. దీని వెనుక కొన్నేళ్ల శ్రమ ఉండాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ముఖ్యంగా తేనేటీగలతో వ్యవహరించేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు. (వైరల్ వీడియో.. వేడి నూనెతో మహిళ సాహసం )
Comments
Please login to add a commentAdd a comment