ginnis record
-
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్‌ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్‌రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో మెడల్స్‌ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
ఈ మాత్రం దానికి ఎస్కలేటర్ ఎందుకో? గిన్నిస్ రికార్డు మళ్లీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్. ఎత్తయిన అరుగులు ఉన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. జపాన్‌లోని కవాసాకి నగరంలో ఉందిది. కవాసాకి రైల్వే స్టేషన్ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే ‘మోర్’’ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే! చిన్నపిల్లలు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలిగినప్పుడు ఈ ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థంకాదు. అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు ఇక్కడకు వస్తుంటారు. -
గిన్నిస్ రికార్డ్ సాధించిన ఉత్తరాఖండ్ రైతు
ధనియాల మొక్క సాధారణంగా 2–3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు గోపాల్ ఆపిల్ తోటలో ధనియాల మొక్క ఏకంగా ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరిగింది. ఇది గిన్నిస్ రికార్డ్. గతంలో 5.9 అడుగుల ఎత్తు ధనియాల మొక్క గిన్నిస్ బుక్‌లో నమోదై ఉంది. కొద్ది నెలల క్రితం గోపాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. గోపాల్ దత్ ఉప్రేటి స్వతహాగా సివిల్ ఇంజనీర్. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఆయన ఐరోపా పర్యటనకు వెళ్లినప్పుడు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను తొలిసారి గుర్తించారు. తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఉత్తరాఖండ్ రాష్ట్రం రాణిఖేత్ ప్రాంతంలోని స్వగ్రామం బిల్‌కేష్‌కు తిరిగి వచ్చారు. 2015 నుంచి తనకున్న మూడెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 8 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఆయన తోటలో 2వేల ఆపిల్ చెట్లున్నాయి. వాటి మధ్య వందలకొద్దీ ఎత్తయిన ధనియాల మొక్కలు కనిపిస్తాయి. అల్లం, పసుపు కూడా అంతర పంటలుగా సాగు చేస్తుంటారాయన. ఆయన తోటలో ధనియాల మొక్కలు బాగా ఎత్తుగా వుండటం చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వరకు ఆ విషయాన్ని ఆయన గుర్తించనే లేదు. ఈ నేపథ్యంలో స్నేహితుల సూచన మేరకు స్థానిక ఉద్యాన శాఖ అధికారిని ఆహ్వానించి తన తోటలోని ధనియాల మొక్కల ఎత్తును కొలిపించాడు గోపాల్. చాలా మొక్కలు ఐదు అడుగుల వరకు ఎత్తు ఉండగా, ఒకటి మాత్రం ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరగటం గుర్తించి నమోదు చేశారు. 2020 ఏప్రిల్ 21న గిన్నిస్ బుక్ తన వెబ్సైట్లో ఇదే అత్యంత ఎత్తయిన ధనియాల మొక్క అని ప్రకటించింది. నిజానికి, గోపాల్ ధనియాల మొక్కలను ఆపిల్ చెట్లకు చీడపీడల బెడద తగ్గుతుందన్న ఉద్దేశంతో అంతర పంటగా సాగు చేస్తూ వచ్చారు. ధనియాల మొక్క పూలకు ఆకర్షితమై తేనెటీగలు, ఈగలు తోటలోకి వస్తూ ఉండటం వల్ల చీడపీడల బెడద తగ్గిందని ఆయన అంటున్నారు. స్థానికంగా దొరికే ధనియాలనే విత్తనాలుగా వేశారు. అయితే ఎత్తుగా పెరగటం కోసం ధనియాల మొక్కల కొమ్మలను కత్తిరిస్తూ ఉంటారు. వేపపిండి, జీవామృతం వేస్తూ, గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. అంతే. ఇంకేమీ ప్రత్యేక పోషణ అంటూ ఏమీ లేదని గోపాల్ తెలిపారు. అయితే, గత ఐదేళ్లుగా తన తోటలో పెరిగే ధనియాల మొక్కల్లోనే మెరుగైన వాటిని ఎంపిక చేసి, ఆ విత్తనాలనే తదుపరి పంటగా విత్తటం వల్ల అనుకోకుండానే ఓ సరికొత్త ధనియాల వంగడం తయారైంది. ఒక్కో మొక్క అర కేజీ వరకు ధనియాల దిగుబడినివ్వటం విశేషం. సాధారణ ధనియాల మొక్క నుంచి 20–50 గ్రాముల మేరకే దిగుబడినిస్తుంది. ధనియాల పంట విత్తటంలో మెలకువలను గోపాల్ ఇలా వివరించారు.. ‘«మట్టిలో అర అంగుళం నుంచి అంగుళం లోతులోనే ధనియాలను విత్తుకోవాలి. రెండు విత్తనాలకు మధ్య 5–6 అంగుళాల దూరం ఉంచాలి. నేలలో తేమ ఆరిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగని ఎక్కువ నీరు పోస్తే వేరు కుళ్లు దెబ్బతీస్తుంది. కుండీలు, మడుల్లో సాగు చేసే వారు ఖచ్చితంగా ఎక్కువైన నీరు బయటకు పోయేందుకు కుండీ/మడి కింది భాగంలో విధిగా బెజ్జాలు చేయాలని సూచించారు. ధనియాల మొక్క ప్రధాన వేరు బాగా లోతుకు వెళ్తుందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైనా ధనియాలను సాగు చేసుకోవచ్చన్నారు. ఇతర రైతులకు ఇవ్వటానికి వెయ్యి ధనియాల విత్తనాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. -
ఒళ్లంతా తేనెటీగలతో.. షాకింగ్ వీడియో
ఒక్క తేనెటీగ కుట్టిందంటేనే దద్దుర్లు వచ్చి భరించనేంత నొప్పి కలుగుతుంది. అలాంటిది వందలు కాదు, వేలు కాదు దాదాపు ఆరు లక్షలకు పైగా తేనెటీగలు కుడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే చాలా విడ్డూరంగా ఉంది కదూ.. కానీ చైనాకు చెందిన రువాన్ లియాంగ్మింగ్ అనే వ్యక్తి మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. అంతేకాకుండా తేనెటీగలు కుడుతున్నంతసేపు అసలు తన చుట్టూ ఏమీ జరగనట్లు ఎంతో శాంతంగా కనిపిస్తున్నాడు. 2016లో జరిగిన ఈ విస్మయం కలిగించే వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు త్రో బ్యాక్ వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఈ కారు మనసులు దోచేయడం ఖాయం ) దాదాపు 637,000కు పైగానే ఉన్న తేనెటీగలు ఉన్నాయని, ఇది చూస్తుంటే లియాంగ్మింగ్కి తేనేటీగలపై ఎంత ప్రేమో అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియో లేటెస్ట్ పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు టన్నుల కొద్దీ లైకులు, షేర్లతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది చాలా అమేజింగ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ.. లక్షల కొద్దీ తేనెటీగలు కుట్టినా అతనికి ఏమీ కాకుండా ఎలా ఉన్నాడు? మనకు చిన్న చీమ కుట్టినా తెగ నొప్పి పుడుతుంది కదా అంటారా..ఇది ఏ ఒక్కరోజులోనో జరిగే ప్రక్రియ కాదు. దీని వెనుక కొన్నేళ్ల శ్రమ ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా తేనేటీగలతో వ్యవహరించేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు. (వైరల్ వీడియో.. వేడి నూనెతో మహిళ సాహసం ) -
జల్లికట్టుకు ‘గిన్నిస్’లో చోటు
సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం పుదుకోట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన జల్లికట్టుకు గిన్నిస్ ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు. అయితే, ఈ క్రీడ తిలకించేందుకు వచ్చిన ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించి 31 మంది గాయాలపాలయ్యారు. గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా విరాళి మలైలో జల్లికట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 1,354 ఎద్దులను రంగంలోకి దించిన నిర్వాహకులు వీటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు. తొలుత 2,000కుపైగా ఎద్దులను బరిలోకి దించాలని భావించినప్పటికీ సమయాభావం కారణంగా కుదరలేదు. పోటీలో ఎద్దుల సంఖ్య ఎక్కువ, పాల్గొనేవారి సంఖ్య తక్కువ కావడంతో క్రీడాకారులతో పాటు సందర్శకులకు కూడా వైద్య బీమా కల్పించారు. ఎద్దులతో జరిగిన పోరులో దాదాపు 31 మంది గాయపడ్డారు. తిలకించేందుకు వచ్చిన వారిపైకి ఎద్దులు దూసుకు పోవడంతో రాము(25), సతీష్(43) అనే వారు ప్రాణాలు కోల్పోయారు. బసవన్నలను అదుపు చేసిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కాగా, భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు దక్కినందుకు లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
జల్లికట్టు.. రికార్డ్ పట్టు!
-
కోటలో లక్ష మందితో...
కోట/జైపూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డుకెక్కింది. యోగా గురు రామ్‌దేవ్ సారథ్యంలో గురువారం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒకేసారి 1.05 లక్షలకు పైగా ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించి రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్, కోట జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పాయి’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను సీఎం రాజే, రామ్‌దేవ్‌లకు అందజేశారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 6.30 నుంచి 7 గంటల వరకు 15 రకాల యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు కోటలోని ఆర్ఏసీ గ్రౌండ్‌కు తరలివచ్చారు. 2017లో మైసూర్లో 55,524 మంది యోగాసనాలు వేసి రికార్డు సృష్టించగా తాజాగా ఆ రికార్డును కోట అధిగమించింది. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలో ‘ఆచార్య’ పేరుతో యోగా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వసుంధరా రాజే ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్లో రవిశంకర్ బెంగళూరు: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ పాల్గొన్నారు. బెల్జియంలో భారత రాయబార కార్యాలయం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, యూరోపియన్ పార్లమెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఎంబసీ అధికారులు, 250 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ..నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సమస్యలైన విద్వేషం, కుంగుబాటును యోగా మాదిరిగా మరే మార్గం పరిష్కరించలేదని అన్నారు. -
మహానేత విజన్‌తో.. గ్రేటర్‌కు మణిహారం..
సాక్షి, హైదరాబాద్ : మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి, దార్శనికతతో హైదరాబాద్ మహానగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు కల సాకారమైంది. సుమారు పుష్కర(12 ఏళ్లు) కాలం పాటు సాగిన ఈ మహా నిర్మాణానికి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది. ఆయన హయాంలోనే ఔటర్ పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా కండ్లకోయ జంక్షన్ పూర్తితో 158 కిలోమీటర్ల మార్గంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని.. విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్న అంశాన్ని వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే గుర్తించారు. భవిష్యత్ అవసరాలను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నగరంపై పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఔటర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సుమారు 6,043 ఎకరాల మేర పట్టా, ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల సేకరణ ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి బాధితులకు సకాలంలో రూ.873 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయడం విశేషం. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీతోపాటు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్రణాళికాబద్ధ లేఔట్లలో ప్లాట్లు(ఇళ్ల స్థలాలు) కేటాయించారు. ఆ తర్వాత అలైన్మెంట్ ఖరారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. భూసేకరణకు కొందరు రైతులు సహకరించకపోవడంతో కండ్లకోయ జంక్షన్ వద్ద కొన్నేళ్లుగా నిలిచిపోయిన 1.10 కిలోమీటర్ల పనులు పూర్తవడంతో మంగళవారం నుంచి ఓఆర్ఆర్ పూర్తిస్థాయిలో అంటే 158 కిలోమీటర్ల మార్గంలో అందుబాటులోకి వచ్చింది. ఓఆర్ఆర్ రోడ్డుకు కలుపుతూ కండ్లకోయ వద్ద ఇంటర్ చేంజ్ రోడ్డు ఎనిమిది లైన్లతో 2 ఎంట్రీ(ప్రవేశ), 2 ఎగ్జిట్(బయటకు) ర్యాంపులు నిర్మించారు. మంగళవారం పురపాలక మంత్రి కేటీఆర్ ఓఆర్ఆర్ కండ్లకోయ జంక్షన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 158 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో ఓఆర్ఆర్ అందుబాటులోకి రావడంతో గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుండటం విశేషం. కండ్లకోయ జంక్షన్ ఆలస్యానికి కారణమిదే. కండ్లకోయ జంక్షన్‌కు సంబంధించి కొందరు రైతులు భూసేకరణలో నష్టపరిహారం తగిన విధంగా లేదని సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ పనులు కొన్నేళ్లపాటు ఆగాయి. రెండేళ్ల క్రితం కండ్లకోయ జంక్షన్ పనులు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మళ్లీ పనులు మొదలెట్టారు. రూ.125 కోట్ల వ్యయం కాగల ఈ పనులను ఆరు నెలల నుంచి వేగాన్ని పెంచి పూర్తి చేశారు. దీంతో నేషనల్ హైవే, స్టేట్ హైవే నెట్‌వర్క్‌తో పాటు సిటీ రోడ్లను అనుసంధానించే మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చింది. నార్సింగ్, కోకాపేట, పటాన్చెరు, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట, శంషాబాద్, టీఎప్పీఏ, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంతాల మీదుగా ఓఆర్ఆర్ వాహనదారులకు సేవలను అందిస్తోంది. నిత్యం 85 వేల వాహనాల రాకపోకలు.. ఓఆర్ఆర్ మార్గంలో నిత్యం 85 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శివారు ప్రాంతాల ప్రజలతో పాటు విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు నగరంలోకి వచ్చేందుకు ఓఆర్ఆర్ను వినియోగిస్తున్నారు. ఎనిమిది లేన్లు కలిగిన ఓఆర్ఆర్లో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. రింగ్ రోడ్డును అనుసంధానించేందుకు నగరం నలుమూలల నుంచి 35 రేడియల్ రోడ్లకు వైఎస్సార్ హయాంలోనే బీజం పడింది. ఇందులో 19 రోడ్లు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. 5 రేడియల్ రోడ్ల నిర్మాణం తుదిదశలో ఉంది. మరో 11 రేడియల్ రోడ్లకు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశారు. వైఎస్సార్ దూరదృష్టితో ఈ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔటర్ ప్రస్థానం మొదలైందిలా 19–10–2004న జీవో నం.442 ద్వారా వైఎస్సార్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2005లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 6,043 ఎకరాల పట్టా, ప్రభుత్వ, అటవీ భూములను సేకరించారు. బాధితులకు రూ.873 కోట్ల నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించారు. 2006 మే 29న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్సార్‌తో కలసి నాటి దేశ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఓఆర్ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణానికి మూడు దశల్లో రూ.6,696 కోట్లు వ్యయం చేశారు. 22 కిలోమీటర్ల గచ్చిబౌలి–నార్సింగ్–శంషాబాద్ మార్గాన్ని 2008 నవంబర్ 14న పూర్తి చేశారు. 38 కిలోమీటర్ల శంషాబాద్–పెద్ద అంబర్‌పేట మార్గాన్ని 2010 జూలై 7న ప్రారంభించారు. 23.7 కిలోమీటర్ల నార్సింగి–పటాన్చెరు మార్గాన్ని 2011 ఆగస్టు 14న ప్రారంభించారు. 38 కిలోమీటర్ల పటాన్చెరు–గౌడవెల్లి, కండ్లకోయ–శామీర్‌పేట మార్గాన్ని 2012 డిసెంబర్ 3న ప్రారంభించారు. 14 కిలోమీటర్ల పెద్ద అంబర్‌పేట–ఘట్కేసర్ మార్గాన్ని 2015 మార్చి 4న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 23 కిలోమీటర్ల ఘట్కేసర్–శామీర్‌పేట మార్గాన్ని 2016 జూలై 15న అందుబాటులోకి తెచ్చారు. ఘట్కేసర్–గచ్చిబౌలి మార్గంలోని 1.1 కిలోమీటర్ల కండ్లకోయ జంక్షన్ పనులు కొందరు రైతులు భూసేకరణకు అంగీకరించకపోవడంతో ఆలస్యమయ్యాయి. -
‘గిన్నిస్ కిక్స్’లో తాండూరువాసి
సాక్షి, తాండూరు టౌన్: గంట వ్యవధిలో అత్యధిక తైక్వాండో కిక్స్‌తో గిన్నిస్ రికార్డు సృష్టించిన జట్టు సభ్యుల్లో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రవికుమార్ ఉన్నారు. గత ఆగస్టు 12 న హైదరాబాద్‌లో నిర్వహించిన తైక్వాండో కిక్స్ గిన్నిస్ బుక్ అచీవ్మెంట్లో.. ఒకే గంటలో 58 వేల కిక్స్‌తో ఉన్న రికార్డును వీరు తిరగరాశారు. తైక్వాండో మాస్టర్ బొబ్బిలి ఆధ్వర్యాన నిర్వహించిన ఈవెంట్లో 89,402 కిక్స్‌తో రికార్డు సవరించారు. జట్టులో పాల్గొన్న రవికుమార్ గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈవెంట్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
రికాడ్డు అందెంచె
జంగారెడ్డిగూడెం : కూచిపూడి నృత్య చరిత్రలో నూతన అధ్యాయం. 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఏక కాలంలో శిరస్సున మంచినీటి బాటిళ్లు ధరించి నృత్య ప్రదర్శనతో వహ్వా అనిపించారు. ఎక్కడా తడబడకుండా వీరు చేసిన నృత్యం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది. ఈ అద్భుత ఘట్టం ఆదివారం జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో ఆవిష్కృతమైంది. జంగారెడ్డిగూడెం స్థానిక అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 25వ కూచిపూడి దేశభక్తి గీతాల నృత్య కళాత్సోవాల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత ఈ ప్రదర్శన ఇప్పించారు. రాష్ట్ర భక్తి గీతం ’మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ విద్యార్థినులు 13.56 నిమిషాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అబ్బుర పరిచింది. ప్రదర్శనను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి బి.స్వదీప్‌రాయ్ చౌదరి ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ నృత్య ప్రదర్శనకు స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని, అందుకే రికార్డు సాధించిందని వెల్లడించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు , నాట్యమయూరి, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత ఎస్.రూపాదేవిని అందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రతిభ, భాష్యం, కిడ్స్, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు అభినయ కూచిపూడి నాట్య అకాడమికి చెందిన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం విద్యార్థులు, ఇండియన్ యూపీ స్కూల్, అక్షర పాఠశాల, సరిపల్లికి చెందిన ఎంవీఆర్ విద్యానికేతన్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సుకవిత నాట్యాచార పసుమర్తి శ్రీనివాసశర్మ, మహిళా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ లక్ష్మీకుమారి వ్యవహరించారు. తొలుత నటరాజ పూజా కార్యక్రమాలను చిట్రోజు తాతాజీ దంపతులు, బాలాజీరావు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వం నుంచి అకాడమీ ఏర్పాటు కు భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే అమరావతిలోను అవకాశం ఉంటే రిపబ్లిక్ డే పరేడ్ ఈ ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతులు తీసుకుంటానని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఫోన్లో అభినందనలు తెలిపారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కె.మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.రాంబాబు, మండవ లక్ష్మణరావు, సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, బండారు సత్యనారాయణ, దల్లి రామాంజనేయరెడ్డి, ప్రముఖ శిల్పి దేవికారాణి ఒడయార్, ఆకాశవాణి ప్రతినిధి బి.జయప్రకాష్, కళాకారులు, అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. -
రికాడ్డు అందెంచె
జంగారెడ్డిగూడెం : కూచిపూడి నృత్య చరిత్రలో నూతన అధ్యాయం. 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఏక కాలంలో శిరస్సున మంచినీటి బాటిళ్లు ధరించి నృత్య ప్రదర్శనతో వహ్వా అనిపించారు. ఎక్కడా తడబడకుండా వీరు చేసిన నృత్యం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది. ఈ అద్భుత ఘట్టం ఆదివారం జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో ఆవిష్కృతమైంది. జంగారెడ్డిగూడెం స్థానిక అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 25వ కూచిపూడి దేశభక్తి గీతాల నృత్య కళాత్సోవాల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత ఈ ప్రదర్శన ఇప్పించారు. రాష్ట్ర భక్తి గీతం ’మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ విద్యార్థినులు 13.56 నిమిషాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అబ్బుర పరిచింది. ప్రదర్శనను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి బి.స్వదీప్‌రాయ్ చౌదరి ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ నృత్య ప్రదర్శనకు స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని, అందుకే రికార్డు సాధించిందని వెల్లడించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు , నాట్యమయూరి, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత ఎస్.రూపాదేవిని అందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రతిభ, భాష్యం, కిడ్స్, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు అభినయ కూచిపూడి నాట్య అకాడమికి చెందిన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం విద్యార్థులు, ఇండియన్ యూపీ స్కూల్, అక్షర పాఠశాల, సరిపల్లికి చెందిన ఎంవీఆర్ విద్యానికేతన్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సుకవిత నాట్యాచార పసుమర్తి శ్రీనివాసశర్మ, మహిళా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ లక్ష్మీకుమారి వ్యవహరించారు. తొలుత నటరాజ పూజా కార్యక్రమాలను చిట్రోజు తాతాజీ దంపతులు, బాలాజీరావు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వం నుంచి అకాడమీ ఏర్పాటు కు భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే అమరావతిలోను అవకాశం ఉంటే రిపబ్లిక్ డే పరేడ్ ఈ ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతులు తీసుకుంటానని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఫోన్లో అభినందనలు తెలిపారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కె.మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.రాంబాబు, మండవ లక్ష్మణరావు, సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, బండారు సత్యనారాయణ, దల్లి రామాంజనేయరెడ్డి, ప్రముఖ శిల్పి దేవికారాణి ఒడయార్, ఆకాశవాణి ప్రతినిధి బి.జయప్రకాష్, కళాకారులు, అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. -
వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు
లండన్: లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. లేటు అంటే మామూలు లేటు కాదు.. వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు. ఇంత ముదిమి వయసులో వీరు 50 మంది కుటుంబ సభ్యులు, ఓ గిన్నిస్ ప్రతినిధి సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వరుడు జార్జ్ కిర్బీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ వివాహం జరిగింది. వీల్‌చైర్‌పై ఉన్న వరుణ్ని తోసుకుంటూ వచ్చిన వధువు డోరీన్ లక్కీ.. అతని వేలికి ఉంగరాన్ని తొడిగింది. వీరిద్దరూ 1988లో కలుసుకున్నారు. అప్పటికి కిర్బీ వైవాహిక బంధం విఫలమవ్వగా, లక్కీ తన భర్తను కోల్పోయి మూడేళ్లయింది. వీరికి ఏడుగురు బిడ్డలు, 15 మంది మనుమలు, ఏడుగురు మునిమనుమలు ఉన్నారు. -
తాపేశ్వరం లడ్డు ‘హ్యాట్రిక్’ గిన్నిస్ రికార్డు
మూడోసారీ తాపేశ్వరం లడ్డూ గిన్నిస్ రికార్డులకెక్కింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ ఈ అరుదైన ఘనత సాధించింది. వినాయక చవితి సందర్భంగా గణేష్ మహాలడ్డూల తయారీలో మూడేళ్ల నుంచి వరుసగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటూ వచ్చింది. 2013లో తయారుచేసిన మహాలడ్డూకు గిన్నిస్ రికార్డ్స్ నుంచి శనివారం సర్టిఫికెట్ అందినట్టు సంస్థ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తొలిసారిగా 2011లో విశాఖపట్నానికి చెందిన సువర్ణభూమి సంస్థ ఆర్డర్‌తో 5,570 కిలోల లడ్డు, 2012లో రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆర్డర్ మేరకు 6,599.29 కిలోల లడ్డు, 2013 ఆగస్టులో వినాయక చవితి సందర్భంగా అదే కమిటీ వారికి తయారు చేసిన 7,132.87 కిలోల మహాలడ్డూ వరుసగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాయని వివరించారు. తమ సంస్థ మినహా ప్రపంచంలో ఏ స్వీట్ స్టాల్ మూడుసార్లు గిన్నిస్ రికార్డు సాధించలేదని చెప్పారు. - న్యూస్‌లైన్, మండపేట -
డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ యువ ప్రొఫెసర్ 130 గంటలపాటు (5 రోజులకు పైగా) నిరాఘాటంగా పాఠాలు బోధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. నిరాఘాటంగా పాఠాలు బోధించడంలో ఇప్పటి వరకు పోలాండ్ ఉపాధ్యాయుడి పేరుతో ఉన్న రికార్డును(121 గంటలు) అధిగమించారు. వివరాలు.. 26 ఏళ్ల అరవింద్ మిశ్రా స్థానిక గ్రాఫిక్ ఎరా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నిరాఘాట బోధనలో ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాలనే ఉద్దేశంతో మెకానికల్ ఇంజనీరింగ్ అంశాన్ని 130 గంటలపాటు నిరాఘాటంగా బోధించారు. వర్సిటీలోని ఎంబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ ప్యానల్ హాజరై యువ ప్రొఫెసర్ బోధన పట్ల అచ్చరువొందింది. కాగా, మిశ్రాను వర్సిటీ చైర్మన్ పొగడ్తలతో ముంచెత్తి రూ. లక్ష రివార్డు అందజేయడంతోపాటు పదోన్నతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు.