
తేనెటీగల విజృంభణ..
హజారీబాగ్: నేపాల్ భూకంపం వల్ల ఏర్పడిన ప్రకంపనలు శనివారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌నూ తాకాయి. హజారీబాగ్‌లో ప్రకంపనల వల్ల పలు భవనాల గోడలపై ఉన్న 24 తేనెతుట్టెలు కదిలిపోవడంతో భారీ సంఖ్యలో తేనెటీగలు వెల్లువెత్తాయి. నగరంలోని జీవన్‌జ్యోతి క్యాంపస్, ఎల్‌ఐసీ భవనాల నుంచి విజృంభించిన ఈ తేనెటీగలు 33వ జాతీయ రహదారిపైకి పోటెత్తాయి.
దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు కొన్ని నిమిషాలపాటు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అయితే, ప్రయాణికులెవరినీ తేనెటీగలు కుట్టలేదని, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి తమ తేనెతుట్టెలకు వెళ్లిపోయాయని స్థానికులు వెల్లడించారు.