చిత్తూరు: గంగమ్మ గుడికి దర్శనానికి వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తానా చెక్‌పోస్టు వద్ద గంగమ్మ గుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో 15 మంది భక్తులకు గాయాలయినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.