కాఫీటీగలయ్యాయి.. | Something Special | Sakshi
Sakshi News home page

కాఫీటీగలయ్యాయి..

Published Mon, Nov 2 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

కాఫీటీగలయ్యాయి..

కాఫీటీగలయ్యాయి..

సమ్‌థింగ్ స్పెషల్

కేవలం మనుషులు మాత్రమే కాఫీ అంటే పడి చచ్చిపోతారన్నది మీ అభిప్రాయమా? అయితే మరోసారి బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటారా? ఇటీవల లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ విద్యార్థులు ఓ పరిశోధన చేశారు. అది మనుషులపైన కాదు.. తేనెటీగలపైన.. ఆ విద్యార్థులు చివరికి ఓ వింత్తై విషయాన్ని తేల్చారు. అదేమిటంటే కాఫీ ప్రియుల సంఖ్యలో తేనెటీగలు కూడా చేరాయట. సారీ..సారీ.. ఇప్పుడు వాటిని కాఫీటీగలనాలేమో.. ఎందుకంటే అవి కాఫీ కోసం తెగ తంటాలు పడుతున్నాయట.          
 పరిశోధన సమయంలో ఎన్నో తేనెటీగలు తమ ఆహారం గురించి 4-5 గంటల పాటు కాఫీ మొక్కలను వెతకడం చూసి ఆశ్చర్యపోయారట విద్యార్థులు.

ఆకలితో ఆపసోపాలుపడుతున్నా, తేనెనందించే పూలు ఎదురుగా ఉన్నా అవి కాఫీ రుచి కోసం వెతుకుతున్నాయంటే వాటికి అది ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కానీ దీని కారణంగా  మిగతా మొక్కలకు పెద్ద హానే జరుగుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగల ద్వారా పాలినేషన్ జరుగుతుండటం సహజం. కానీ ఇప్పుడు కాఫీ తాగుతున్న టీగల కారణంగా మిగతా పూలలో ఉండే  మకరందంలోని తియ్యదనం తగ్గుతోందట. ఇంకో విచిత్రం ఏమిటంటే ‘తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టు’ కాఫీకి బాగా అలవాటు పడిన టీగలు తన చుట్టు పక్కనున్న తేనెటీగలకు కూడా ఈ కాఫీ రుచిని చూపించి వాటికీ అలవాటు చేస్తున్నాయట.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement