వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడులోని బొగత జలపాతాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్, టూరిజం ఈఈ సహా పలువురికి గాయాలయ్యాయి.
జలపాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు కలెక్టర్ మురళి, సబ్ కలెక్టర్ గౌతమ్, టూరిజం ఈఈలతో కలిసి గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అధికార బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్ గౌతమ్‌కు చెవి, ముక్కు, గొంతు ప్రాంతాల్లో గాయాలయ్యాయి. అధికారులతో పాటు అక్కడ ఉన్న పర్యటకులపై కూడా తేనెటీగలు విరుచుకుపడటంతో.. భయంతో పరుగులు తీశారు.
తేనెటీగల దాడిలో సబ్‌కలెక్టర్‌కు గాయాలు
Published Thu, Jun 15 2017 6:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
Advertisement
Advertisement