![పక్షుల సంఖ్య తగ్గిపోతోంది... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61411664134_625x300.jpg.webp?itok=E7GrIvzr)
పక్షుల సంఖ్య తగ్గిపోతోంది...
క్రిమి సంహారకాలను ఉపయోగించడం వలన తేనెటీగలు మరణిస్తున్నాయనీ, వాటిని తిని పక్షులు అంతరించిపోతున్నాయనీ ఐరోపా ఒక రిపోర్టులో తెలియచేసింది. క్రిములను నిర్మూలించడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే ఒక నియో నికొటినాయిడ్ కెమికల్‌ను వ్యవసాయదారులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ కీటకనాశిని 1990లో మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయమైంది.
వ్యవసాయదారులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ మందును తయారుచేసినప్పటికీ, ఈ మందులో పక్షులను అంతమొందించే రసాయనాలు కలిసి ఉన్నాయి.
నియో నికొటినాయిడ్స్‌ను ఉపయోగించడం ప్రారంభించిన నాటి నుంచి ఆ మందు ఎంతో విజయవంతంగా పని చేస్తోంది.
క్రిమిసంహార క మందుల వాడకం వలన మామూలు పక్షులు బాగా తగ్గిపోతున్నాయని మొట్టమొదటిసారిగా తేల్చారు.
అనేక రకాల పక్షి జాతులు... వాటి ఆహారం కోసం ప్రధానంగా క్రిమికీటకాల మీద ఆధారపడతాయి. రాబ్లర్ (కోయిలలా పాడే గొంతు గల పక్షులు), స్వాలోస్ (వాన కోయిల), స్టార్లింగ్ (పెడిసె పిట్ట వంటి ఒక పక్షి), థ్రష్ (తీయగా పాడే ఒక పక్షి) తదితర పక్షుల ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. భూమిలో లభించే నీటిని పరిశీలించినప్పుడు... నీటిలో క్రిమిసంహారకాలు అధికంగా ఉన్నాయనీ, ఈ కారణంగానే అనేక రకాల పక్షి జాతుల సంఖ్య తగ్గిపోతున్నాయి.
పక్షులు తక్కువగా ఉండటం వల్ల పునరుత్పత్తి జరగట్లేదు. అందువల్ల కొత్తగా గుడ్లు పెట్టలేకపోతున్నాయి. పక్షుల సంఖ్య తగ్గడానికి ఇదీ ఒక కారణమే.
తగినంత ఆహారం లభించకపోవడం వల్ల పక్షుల మరణాల సంఖ్య పెరుగుతోంది.
పక్షులు అంతరించిపోవడానికి స్మోకింగ్ గన్ ప్రధాన కారణం. నియో నికొటినాయిడ్స్‌ని జాగ్రత్తగా ఉపయోగిస్తే అవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవని కొందరు చెబుతున్నారు.