
తుట్టె కదల్చకుండానే... పుట్టెడు తేనె!
తేనెతుట్టెను కదల్చకుండా... తేనెటీగలను తరిమేయకుండా పుట్టతేనెను సేకరించ గలమా? అబ్బే... అస్సలు సాధ్యం కాదంటున్నారా? మామూలుగానైతే వీలుకాక పోవచ్చుగానీ.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు స్టూవర్ట్ ఆండర్సన్, సెడార్‌ల ఆవిష్కరణ పుణ్యమా అని అదిప్పుడు సాధ్యమే. ఇందు కోసం వారు కృత్రిమ తేనెపట్టునొకదాన్ని తయారు చేశారు. ప్రత్యేక పదార్థాలతో తయారైన ఈ తేనెపట్టులో తేనెటీగలు నివాసముండే షడ్భుజి ఆకారపు రంధ్రాలు ఉంటాయి.
తేనెటీగలు పూల నుంచి సేకరించే మకరందాన్ని ఈ రంధ్రాల్లోనే నిల్వ చేస్తాయి. అయితే ఒక మీట ద్వారా ఈ రంధ్రాల న్నింటి నుంచి తేనె నేరుగా కిందకు దిగేలా చేయవచ్చు. పట్టు దిగువభాగంలో గొట్టాన్ని ఏర్పాటు చేసి నేరుగా తేనె సేకరించవచ్చు. ఇది కూడా భలే ఐడియానే!