అనంతపురం జిల్లా గోరంట్ల సమీపంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు.ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది.
అనంతపురం జిల్లా గోరంట్ల సమీపంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. గోరంట్ల సమీపంలోని పులేరు రోడ్డులో ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తి ఎదురుగా వస్తున్న ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు, ద్విచక్రవాహనంపై వస్తున్న ఒక వ్యక్తి గాయపడ్డారు. వీరిలో కర్ణాటకకు చెందిన పెద్దరంగప్ప(60), జయప్ప (55), లక్ష్మమ్మ(45)ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అరగంట వేచి ఉన్నా.. వైద్య సిబ్బంది ఎవరూ రాకపోవడంతో క్షతగాత్రుల బంధువులు ఆందోళనకు దిగారు. గోరంట్ల పోలీసులు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తిని అరెస్ట్‌చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.