
షూటింగ్‌లో హీరోకు గాయాలు
ముంబై: బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్ ‘పద్మావతి’ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డాడు. తలకు గాయాలు కావటంతో చికిత్స అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. చిత్రీకరణలో భాగంగా రణవీర్ పై ఒక సీన్ తీస్తుండగా తలకు గాయమయింది. అయితే అతడు ఆ గాయన్ని పట్టించుకోలేదు.
కొద్దిసేపటి తర్వాత తలకు తగిలిన దెబ్బ కారణంగా రక్తం వస్తోందని చిత్ర యూనిట్ గుర్తించింది. దీంతో రణవీర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించామని, కోలుకున్న అతడు షెడ్యూల్ ప్రకారం తదుపరి షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు తెలిపాయి. చికిత్సలో భాగంగా రణవీర్ తలకు కుట్లు పడ్డాయని చిత్ర వర్గాలు వివరించాయి. సంజయ్ భన్సాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న పద్మావతి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్‌సింగ్, పద్మావతిగా దీపికా పడుకొనె నటిస్తున్నారు.