యువకుడికి ఏడాది జైలు
Published Thu, Nov 17 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
కొయ్యలగూడెం: వ్యక్తిపై దాడిచేసి గాయపర్చిన కేసులో యువకుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని ఎస్సై పి.చెన్నారావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యర్రంపేట గ్రామానికి చెందిన ఓలేటి గంగాధర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణను 2014 జూ¯ŒSలో దాడిచేసి గాయపర్చాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో గంగాధర్‌కు ఏడాది జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జంగారెడ్డిగూడెం సివిల్ జడ్జి డి.అజయ్‌కుమార్ తీర్పుచెప్పారు.
Advertisement
Advertisement