లండన్ హౌసెస్ ఆఫ్ పార్లమెంటు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అత్యంత భద్రతా వలయంలోకి అకస్మాత్తుగా అతి వేగంగా చొచ్చుకురావడం కలకలం రేపింది. తీవ్రదాడిగా భావించిన స్థానికులు భయంతో బెంబేలెత్తిపోయారు. వెస్ట్‌మెనిమినిస్టర్ ట్యూబ్‌స్టేషన్ వైపు పరుగులు తీశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలు కారును నిలువరించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.