ఆటలు ఓకే.. మరి గాయాల సంగతి ?
ఆటలు ఓకే.. మరి గాయాల సంగతి ?
Published Fri, Sep 2 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
* శిక్షకుల పర్యవేక్షణతోనే భవితకు భరోసా
* నిర్లక్ష్యంతో కెరీర్‌కే ముప్పు
గుంటూరు స్పోర్ట్స్: స్పోర్ట్స్ ఆడడం, వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్య పరంగా చాలా లాభాలు ఉన్నాయి. అయితే స్పోర్ట్స్ ఆడే సమయంలో, వ్యాయామాలు చేసేటప్పుడు సరైన ట్రైనింగ్, రక్షణ కవచాలు, వార్మప్ లేకపోవడం వల్ల గాయాలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కొన్ని క్రీడా గాయాలు చిన్నవిగా త్వరగా మానేవి. మరికొన్ని గాయాలు తీవ్రంగా ఉండి, ఆ వ్యక్తి క్రీడలకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రాణాంతకం కూడా అవుతున్నాయి. క్రీడా గాయాలపై క్రీడాకారులకు సరైన అవగాహన లేకపోవడంవ వల్లే చాలా మంది క్రీడాకారులు తమ కెరీర్‌ను కోల్పోతున్నారు. క్రీడలు, వ్యాయామల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
మూడు రకాల గాయాలు..
క్రీడా గాయాలు డైరెక్ట్ ఇంజురీ, ఇండైరెక్ట్ ఇంజురీ, ఓవర్ యూస్ ఇంజురీ అని మూడు రకాలు. క్రీడల్లో గట్టిగా వుండే ఎముకలు విరగంతో పాటు లిగ్‌మెంట్, కండరాలు చిట్లే ప్రమాదం వుంది. మన శరీరంలోని ఎముకలు, జాయింట్‌లు సరిగ్గా కదలటానికి లిగ్‌మెంట్, కండరాలు సహకరిస్తాయి. లిగ్‌మెంట్, కండరాలు దెబ్బతింటే జాయింట్స్‌కు పట్టుత్వం తగ్గుతుంది.
డైరెక్ట్ ఇంజురీ : బయట నుంచి బలంగా ఏదైనా తగలడం, మరో ఆటగాడు ఢీకొనడం, బంతి, బ్యాట్ తగలడం వల్లే కలిగే దెబ్బలు.
ఇండైరెక్ట్ ఇంజురీ : పరుగెత్తే, దూకిన సమయాల్లో కాళు, చేతులు మెలిక తిరగడం, గూడ జారడం, ఇండైరెక్ట్ ఇంజూరీస్.
ఓవర్ యూజ్ ఇంజురీ : ఒక్కసారి గాయామైనప్పుడు తిరిగి ఆడడం వల్ల గాయాం పెద్దది అయి కండరాలు, లిగ్‌మెంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఓవర్ యూజ్ ఇంజురీ అంటారు.
దెబ్బతగిలిన వెంటనే చేయకూడనివి..
వేడి కాపడం పెట్టడం, దెబ్బతిన్న భాగాన్ని మసాజ్ చేయడం, దెబ్బ తగిలిన భాగానికి విశ్రాంతి లేకుండా మళ్లీ వాడడం చేయకూడదు. వైద్యులు పరిశీలించిన తరువాత గాయాలపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. సరైన వైద్యం తరువాత దెబ్బతిన్న ఎముకలు, లిగ్‌మెంట్, కండరాలు తిరిగి మాములు స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ, వ్యాయామాలు చేయాల్సి వుంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రక్షణ కవచాలు ధరించడం: సరైన, సరిపోయే హెల్మెట్స్, గ్లౌజ్, ప్యాడ్స్, షూ నాణ్యమైనవి ధరించాలి. వార్మప్, స్ట్రచ్చింగ్, ఎక్సైర్‌సైజ్‌లు: ఆట మొదలు పెట్టేటప్పుడు, సాధన చేసేటప్పుడు, తరువాత వార్మప్ స్ట్రచ్చింగ్, ఎక్సైర్‌సైజ్‌లు తప్పనిసరిగా చేయాలి. దీని వల్ల కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది.
టెక్నిక్స్ లేకుంటే గాయాలే...
మంచి స్పోర్ట్స్ కోచ్ సాయంతో సరైన టెక్నిక్స్ తెలుసుకుని క్రీడలు ఆడాలి. సరైన టెక్నిక్ లేకుండా ఆటలు ఆడితే ఎక్కువ గాయాల పాలయ్యే అవకాశం ఉంది.
మధ్యలో బ్రేక్ అవసరం...
ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. తగినంత వాటర్, జూస్ తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే కండరాలకు హైడ్రేషన్ తగ్గి త్వరగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
Advertisement