మలయాళ మెగాస్టార్‌కు గాయాలు | Mammootty sustains minor injuries while shooting fight sequence | Sakshi
Sakshi News home page

మలయాళ మెగాస్టార్‌కు గాయాలు

Published Mon, Feb 19 2018 2:09 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

Mammootty sustains minor injuries while shooting fight sequence - Sakshi

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ షూటింగ్‌లో  స్వల్పంగా గాయపడ్డారు. తన రాబోయే చిత్రం మామంగమ్‌ లోని ఒక ఫైటింగ్‌  సీన్‌ చిత్రీకరణ సందర్భంగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని  ఫిల్మ్ టీమ్‌  ఫేస్‌బుక్‌లో వెల్లడించింది.  ఈ మూవీలో కీలక మైన యుద్ధ  సన్నివేశాన్ని తీస్తుండగా గాయపడినట్టు తెలిపింది.  అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. షూటింగ్‌లో మమ్ముట్టి గాయపడ్డారన్నవార్తతో ఆయన అభి​మానులో ఆందోళనలో పడిపోయారు.  

రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక సినిమాకు  సజీవ్‌ పిళ్లై దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో మమ్ముట్టి నాలుగు విభిన్న పాత్రల్లో అలరించనున్నారట.  తెలుగు, హిందీ,  తమిళ, ఇంగ్లీషు భాషల్లో  రిలీజ్‌కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖులు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు  సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement