కంచికర్ల మండలకేంద్రంలోని చెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
కంచికర్ల మండలకేంద్రంలోని చెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుఅయింది. ఈ ఘటనపై పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.