ధర్మవరం: వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిరోసిన్ స్టవ్ పేలి భార్యా భర్తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కోలకత్తాకు చెందిన బబ్లూ, జాస్మీన్ భార్యాభర్తలు స్థానికంగా పట్టుచీరలపై డిజైన్‌లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ రోజు వంట చేయడానికి ప్రయత్నిస్తుండగా.. స్టవ్ పేలింది. దీంతో మంటలు ఎగిసిపడి జాస్మీన్ కు అంటుకున్నాయి. ఇది గుర్తించిన భర్త ఆమెను కాపాడటానికి ప్రయత్నించడంతో.. అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.