ప్రముఖ నటుడు కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ జారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయం అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కమల్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కమల్ కు ప్రమాదంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.