మందుగుండు తయారీలో ప్రమాదం
Published Mon, Oct 24 2016 2:21 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
డి.ముప్పవరం (నిడదవోలు) : మండలంలోని డి.ముప్పవరం గ్రామంలో పిల్లలు ఓ ఇంట్లో మందుగుండు సా మగ్రి తయారుచేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా సామిరాజు ఇంటి వద్ద ఆయన కుమారుడు ధనరాజుతో పాటు పలువురు పిల్లలు తాటాకు టపాకాయలు కడుతున్నారు. ఇదే సమయంలో ధనరాజు స్నేహితుడు ఒకడు సరదాగా కాగితాన్ని అంటించి ఆటపట్టించేందుకు ప్రయత్నించగా అది టపాసులు చేస్తున్న పటాస్‌పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ధనరాజు శరీరం, మొహానికి గాయాలయ్యాయి. బంధువులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు అక్కడ చికిత్స పొందుతున్నాడు.
యథేచ్ఛగా విక్రయాలు
పట్టణంలోని పలు దుకాణాల్లో మందుగుండు సామగ్రి ముడిసరుకు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు పటాస్ వంటి సామగ్రిని విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు చిన్న పిల్లలకు కూడా విక్రయించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement