ఈ రోడ్డులో నడక సాగేదెలా.. ?
-
వర్షకాలంలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు
-
గాయాలపాలవుతున్న వాహనదారులు
-
పట్టించుకోని అధికారులు,
జుక్కల్ : మండలంలోని లింగంపల్లి, విట్టల్‌వాడి, విట్టల్‌వాడి తాండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ నుంచి జిల్లా బార్డరు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు వేసవిలో పనులు చేపట్టాల్సి ఉండగా వర్షాకాలంలో పనులు చేపడుతుండడంతో రోడ్డు అధ్వాన్నంగా మారింది. సావర్‌గావ్ గ్రామ ప్రాంతంలో కల్వర్టు నిర్మాణానికి అడ్డంగా రోడ్డు తవ్వడంతో రెండు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వాహనాలు వెళ్లేందుకు సౌకర్యం లేక పొవడంతో ఆయా గ్రామాల ప్రజలు కిలోమీటర్ దూరం నడచి ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డుపై వేసిన నల్లమట్టితో బురదగా మారి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. బురదతో వాహనాలు అదుపు తప్పి పలువురు గాయాల పాలవుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల వి«ధ్యార్థులు రోడ్డువెంట నడంలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. రోడ్డుకు మరమ్మత్తు చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.