లారీ బైక్‌ను ఢీకొనడంతో ఓ ఆర్మీ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది.
ఖమ్మం రూరల్ : లారీ బైక్‌ను ఢీకొనడంతో ఓ ఆర్మీ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట జంక్షన్ వద్దమంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటకు చెందిన ఆర్మీ కానిస్టేబుల్ ఎండీ.నయీమ్ ముల్కలపల్లి వైపు నుంచి ఖమ్మం వస్తున్నాడు. ఈ క్రమంలో నాయుడుపేట జంక్షన్ వద్దకు రాగానే ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో నయీమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై టి.గోపి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం నయీమ్‌ను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.