బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు | bus accident in nalgonda district | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు

Published Wed, Mar 23 2016 7:36 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

bus accident in nalgonda district

చివ్వెంల: నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున ఆర్టీసీ ఇంద్రా బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన ఇంద్రా బస్సు హైదరాబాద్‌కు వెళుతూ జేసీబీని తప్పించబోయి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సులోని 25 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement