సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment