kaveri travels bus
-
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
కాలువలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
కాలువలోకి దూసుకెళ్లిన కావేరి బస్సు
సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్ ప్లేట్ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
3 కిలోల బంగారం బ్యాగు మాయం
సాక్షి, హైదరాబాద్: బస్సులో ప్రయాణిస్తుండగా మూడు కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఇద్దరు వ్యాపారులు బుధవారం ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ రఫిక్ మహ్మద్, ఎస్.కె.మహ్మద్‌పాషాలు అక్షయ తృతీయ సందర్భంగా శనివారం రాత్రి కావేరి ట్రావెల్స్ బస్సులో మూడు కేజీల బంగారు ఆభరణాలు బ్యాగులో పెట్టుకుని నగరానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఎల్బీనగర్ రింగురోడ్డు సమీపంలోకి రాగానే వీరి వెనుక సీటులో కూర్చున్న కొంతమంది ఒక్కసారిగా దిగి వెళ్లిపోయారు. బస్సు దిల్సుఖ్నగర్ సమీపానికి చేరేసరికి ఈ విషయం గమనించిన వ్యాపారులు బస్సు ఆపి పరిశీలించారు. బ్యాగు దొరక్కపోవడంతో అదే రోజు నెల్లూరులో కావేరి ట్రావెల్స్ వద్దకు వెళ్లి వారి వెనుక సీటులో కూర్చున్న వారి వివరాలు సేకరించగా బుక్ చేసిన వారి ఫోన్ నెంబర్లు స్విచ్చాఫ్ రావడంతో వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం నగరానికి వచ్చిన వారు ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశారు.