నార్కట్‌పల్లి: మేనేజర్ తమపై ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడని భావించిన కార్మికులు అతడిపై దాడికి దిగిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కట్ పల్లి సమీపంలోని ఓసీటీఎల్ సంస్థలో జరిగిన ఈ ఘటనలో మేనేజర్కు తీవ్ర గాయాలయ్యాయి.
టూల్ జెంట్ విభాగంలో పరికరం పాడు చేశారని కొంతమంది కార్మికుల పేర్లను మేనేజర్ యాజమాన్యానికి పంపాడు. దీంతో ఆగ్రహించిన కార్మికులు మధ్యాహ్నం విధులకు వచ్చిన సమయంలో మేనేజర్‌పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మేనేజర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.