పిచ్చి కుక్కల స్వైర విహారం | 5 injured in dog bite incident | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్కల స్వైర విహారం

Published Wed, Sep 16 2015 12:17 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

5 injured in dog bite incident

నిజామాబాద్ పట్టణంలో పిచ్చిక్కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఉదయం ఒక్క సారిగా పిచ్చి కుక్కలు జనాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో ఐదుగురు గాపయడ్డారు. నిజామాబాద్ పట్టణం గౌతమ్ నగర్ లోని ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘనట జరిగింది. తీవ్రగాయాలైన రోషన్, పాతిమా, గంగాధర్,  బస్వన్, లక్ష్మయ్యలను స్థానికులు కాపాడి.. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

 

కాలనీలో 60కి పైగా కుక్కలు సంచరిస్తున్నాయని.. మూన్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో కుక్కలు ఉండటంతో.. కాలనీలో జనం భయందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నుంచి తమను కపాడాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement