పిచ్చికుక్కల స్వైరవిహరం | 5 children injured in dog bite incident | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల స్వైరవిహరం

Published Sun, Jul 19 2015 9:24 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

5 children injured in dog bite incident

రాయికల్ (కరీంనగర్ జిల్లా) : పిచ్చికుక్కల స్వైరవిహరంతో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామంలో జరిగింది. గత కొంతకాలంగా గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. తాజాగా ఆదివారం గ్రామంలో ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement