తండ్రీకూతుళ్లకు తీవ్రగాయాలు | car hit bike.. father, daughter injured | Sakshi
Sakshi News home page

తండ్రీకూతుళ్లకు తీవ్రగాయాలు

Published Sun, Sep 25 2016 1:54 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

car hit bike.. father, daughter injured

ఏలూరు అర్బన్‌ : కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి మోటార్‌ బైక్‌పై తండ్రి తీసుకువెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తండ్రీకూతుళ్లకు తీవ్రగాయాలయాయి. తండ్రి ఏలూరు ప్రభుత్వాస్పపత్రిలో చికిత్స పొందుతుండగా కుమార్తె పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. మోసూరి వెంకటేశ్వరాచారి, సుమాదేవి దంపతులు కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో నివాసముంటున్నారు. వారి కుమార్తె గీతా వెంకట నర్మద గవరవరంలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన నర్మద అనారోగ్యానికి గురైందని తండ్రి వెంకటేశ్వరాచారికి పాఠశాల సిబ్బంది ఫోన్‌ చేశారు. దీంతో పాఠశాలకు వెళ్లి కుమార్తెను జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి బైక్‌పై తీసుకువెళుతుండగా జంగారెడ్డిగూడెం బైపాస్‌ సమీపంలో కారు వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement