ద్వారకాతిరుమల ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శేషాచలకొండపైన ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న ఆటో శనివారం బోల్తా కొట్టింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, ఇద్దరు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రావులపాలెం సమీపంలోని కొత్తపేట మండలం పలివెలకు చెందిన ఓ భక్తుని కుటుంబం చిన వెంకన్నను దర్శించేందుకు ఆటోలో ద్వా రకాతిరుమల వచ్చారు. స్వామి దర్శనానంతరం అదే ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా టోల్‌గేటు వద్దకు వచ్చేసరికి ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. సమీపం లో ఉన్న భక్తులను ఆటోను లేపి ముగ్గురు భక్తులు, ఆటో డ్రైవర్‌ను బయటకు తీశారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఇద్దరు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో భక్తుడికి ఏమీ కాలేదు. క్షతగాత్రులను దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.