సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్‌పేటకు చెందిన కిష్టయ్య భూమి విషయంలో తన సోదరునితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం తనకు న్యాయం చేయాలంటూ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కిష్టయ్యను సముదాయించి కిందికి దించే ప్రయత్నంలో అతను ఒక్కసారిగా అదుపుతప్పి టవర్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కృష్ణ పేర్కొన్నారు.కాగా కిష్టయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతన్ని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం అందింది.
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కాడు.. అంతలోనే
Published Fri, Dec 27 2019 8:09 PM | Last Updated on Fri, Dec 27 2019 8:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment