Nawabpet
-
ప్రేమ పెళ్లి.. అయిదు రోజుల కాపురం, అంతలోనే మోసం
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రేమించానని నమ్మిం,పెళ్లి చేసుకున్నాడు.ఐదు రోజుల తర్వాత కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన నవాబుపేట మండలంలోని దేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణగౌడ్(23) అదేగ్రామానికి చెందిన రేణుక(21) అనే అమ్మాయినిచాలా ఏళ్లక్రితం నుంచి ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో గత నెల జూలై 17న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఐదు రోజుల పాటు కాపురం చేశారు. అనంతరం సత్యనారాయణ, తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సొంత గ్రామందేపల్లికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లలేదు. అప్పుడు ఇపుడు వస్తానంటూ కాలయాపన చేస్తూవచ్చాడు. కొన్నాళ్లకు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో తనను కేవలం ప్రేమ పేరుతో మోసం చేసి వాడుకుని వదిలేశాడని పేర్కొంటూ బాధితురాలుపోలీసులను ఆశ్రయింంది. అయినా ఫలితం లేకపోవటంతో మంగళవారం భర్త ఇంటి ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ప్రస్తుతం సత్యనారాయణను వారి బంధువులు అజ్ఞాతంలో ఉంచారని, తనకు న్యాయంచేయాలని కోరుతోంది. అప్పటి వరకు ఇంటి ముందే కూర్చుని నిరసన తెలుపుతానని చెప్పారు. ఈవిషయమై సీఐని వివరణ కోరగా ఉమెన్ పీఎస్‌కు రిఫర్ చేస్తామని అన్నారు. చదవండి: రాజస్థాన్ నుంచి వచ్చిన బురిడి బాబాలు.. దోష నివారణ పూజలు చేస్తామని -
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కాడు.. అంతలోనే
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్‌పేటకు చెందిన కిష్టయ్య భూమి విషయంలో తన సోదరునితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం తనకు న్యాయం చేయాలంటూ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కిష్టయ్యను సముదాయించి కిందికి దించే ప్రయత్నంలో అతను ఒక్కసారిగా అదుపుతప్పి టవర్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు.కాగా కిష్టయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతన్ని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం అందింది. -
30ఏళ్లుగా చెట్టు కిందే మహాత్ముడు..
సాక్షి, జడ్చర్ల: ప్రజలనే కాదు.. చివరికి మహాత్ముడి విగ్రహాన్ని కూడా మూడనమ్మకాలు వెంటాడుతున్నాయి. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా గాంధీ విగ్రహం ఏర్పాటుకు నోచుకోక.. పట్టించుకునే వారే కరువై చెట్టు కిందే శిథిలావస్థకు చేరింది. మండలంలోని గురుకుంటలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు విగ్రహాన్ని గ్రామం నుంచి పోమాల్‌కి తరలించారు. అక్కడ సైతం విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో అక్కడ కూడా విగ్రహాన్ని ఏర్పాటుచేయకుండా మండల కేంద్రానికి తీసుకొచ్చారు. 30ఏళ్లుగా చెట్టు కిందే.. మండల కేంద్రంలో ఓ మర్రి చెట్టు కింద ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని దాదాపు 30ఏళ్లుగా అలాగే వదిలేశారు. ప్రస్తుతం పెట్టిన చోటే శిథిలావస్థకు చేరింది. మూడ నమ్మకాలతో గాంధీజీ విగ్రహం ప్రతిష్టకు నోచుకోలేదంటే మారుమూల ప్రాంతాల్లో నమ్మకాలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుంది. -
ఇష్టారాజ్యంగా కెమికల్ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు
సాక్షి, నర్సాపూర్: నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు కాలుష్య జలాలను ఇష్టారాజ్యంగా వదులుతుండటంతో రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలను వ దులుతున్న కెమికల్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పలు కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అందులోని వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా డంపింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉండగా అలా కాకుండా బహిరంగంగా కాలువల ద్వారా బయటకు వదిలేస్తున్నారు. డంపింగ్ కేంద్రాలకు వ్యర్థాలను తరలిస్తే భారీ ఖర్చు అవుతుందనే ఉద్ధేశంతో పరిశ్రమ ఆవరణ నుంచే బయటకు వదిలేస్తున్నారు. వ్యర్థాలు పారిన ప్రదేశంలో పచ్చని గడ్డితో పాటు భూగర్భజలాలు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో సమీప పంటలు దెబ్బతింటున్నాయి. కాలువ ద్వారా వస్తున్న కెమికల్ నీటిని తాగి మూగజీవాలు సైతం మృత్యువాత పడిన సంఘటన లు ఉన్నాయి. వర్షాకాలంలోనైతే నేరుగా కాలువల ద్వారా గ్రామ చెరువులోకి చేరుతున్నాయి. వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు పరిశ్రమ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. బిజ్లిపూర్ గ్రామ శివారులో ఉన్న పరిశ్రమ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా బయటకు వదులుతుండడంతో పలువురు రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం.. నవాబుపేటలోని పలు కెమికల్ పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ రసాయనాలతో పంటలు పాడైపోతున్న విషయం గురించి గతంలో రైతులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడికి వచ్చిన అధికారులు వ్యర్థ రసాయనాల శాంపిల్స్‌ను సేకరించి చేతులు దులుపుకున్నారు. సంబంధిత పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. పంటలు పాడైపోతున్నాయి.. గ్రామ శివారులో ఉన్న పరిశ్రమలోని వ్యర్థాలను బయటకు వదులుతుండడంతో పంటలు పాడైపోతున్నాయి. దీంతో పాటు బోరుబావుల నీరు సైతం కలుషితమయ్యాయి. పలుమార్లు కంపెనీ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదు. కాలువ ద్వారా వస్తున్న వ్యర్థ రసాయనాల నీరు తాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. – మహిపాల్‌రెడ్డి, రైతు నవాబుపేట చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం. రైతుల ఫిర్యాదు మేరకు నవాబుపేట గ్రామ పరిధిలో వస్తున్న కెమికల్ వ్యర్థాల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. గతంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేశాం. – రవీందర్, పీసీబీ ఈఈ -
లంచం అడిగిన వీఆర్ఓ.. నిర్భందించిన గ్రామస్తులు
సాక్షి, నవాబుపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఓ ఆది నారాయణను గ్రామస్తులు నిర్భంధించారు. తమ పట్టా పాస్బుక్ల కోసం ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనిదే పని చేయడం లేదని, ఎప్పుడూ మద్యంమత్తులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. గ్రామపంచాయతీలోని ఒక గదిలో ఉంచి బయట తాళం వేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వీఆర్ఓను నిర్బంధించిన గ్రామస్తులు -
వీఆర్ఓను నిర్బంధించిన గ్రామస్తులు
-
15 రోజులే మిగిలింది ..
సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు. కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్లో230, ఖానాపూర్‌లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్‌లో 188, చౌడూర్‌లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆర్ఎంపీ కుటుంబం ఆత్మహత్య
♦ ఆర్థిక ఇబ్బందులు తాళలేక అఘాయిత్యం ♦ భార్యాభర్తలు, కుమార్తె మృతి నవాబుపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుటుంబం గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి భార్యాభర్తలతోపాటు కుమార్తె మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన సామల లక్ష్మీనారాయణ(50) స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. తల్లిదండ్రుల వద్ద చిన్న కుమార్తె సుప్రజ ఉంటోంది. కొన్ని రోజులుగా లక్ష్మీనారాయణ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణ తన భార్య అలివేలు(45), కుమార్తె సుప్రజ(23)లతో కలసి బుధవారం రాత్రి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరం దేవాలయానికి వెళ్లి అక్కడ జాగారం చేశారు. గురువారం తెల్లవారుజామున నవాబ్‌పేటకు బయలుదేరారు. గ్రామ సమీపంలో పొలం వద్దకు వచ్చి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు సుప్రజను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. రామేశ్వరం వెళ్లొస్తానని చెప్పిన కొడుకు శాశ్వతంగా దేవుడు దగ్గరికి వెళ్లాడంటూ ఆయన తల్లి రంగమ్మ గుండెల విసేలా రోదించింది. కాగా, లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ నవాబుపేట పట్టణ మాజీ అధ్యక్షుడు. బాధిత కుటుంబాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
పుణె నుంచి తిరిగొచ్చిన మరుసటిరోజే ఘటన గుబ్బడిగుచ్చతండాలో విషాదఛాయలు స్థానికంగా ఉపాధి కరువైన అతను పొట్టకూటికోసం కుటుంబ సభ్యులతో కలిసి వేరే రాష్ట్రానికి వలస వెళ్లాడు.. కాగా, శ్రావణమాస పూజల్లో భాగంగా స్వగ్రామానికి తిరిగి వచ్చిన మరుసటిరోజే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవాబుపేట : రేకులచౌడాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుబ్బడిగుచ్చతండాకు చెందిన బదావత్ రవినాయక్ (38) కి భార్యలు మారు, యాదమ్మతోపాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే ఇద్దరు భార్యలతో కలిసి మహారాష్ట్రలోని పుణెకు వలస వెళ్లాడు. తమ పిల్లలను మాత్రం తండాలోని తమ్ముడు గోపి వద్దే ఉంచాడు. కాగా, శ్రావణమాసం సందర్భంగా ఈనెల 26న స్వగ్రామానికి వచ్చి మరుసటిరోజు స్థానికంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అదే అర్ధరాత్రి ఇంటికి చేరుకుని దుస్తులను దండెపై వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరు భార్యలు స్వగ్రామానికి చేరుకుని బోరుమన్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా తండాలో నెల రోజులుగా తరచూ ఇళ్లలో షాక్ వస్తోందని గిరిజనులు ఆరోపించారు. సెల్ చార్జింగ్ పెట్టేప్పుడు, ఫ్యాన్ స్విచ్‌లు వేయాలంటేనే ఆందోళనకు గురవుతున్నామన్నారు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సమస్య వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. 28జడ్సీఎల్402 : -
మరికల్‌ను నవాబుపేటలో కలపండి
నవాబుపేట : మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా మరికల్ గ్రామాన్ని నవాబుపేటలో కలిపి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి తీసుకు రావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లా సరిహద్లులో ఆదివారం వారు ధర్నా చేపట్టారు. మరికల్ గ్రామం నవాబుపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రంగారెడ్డి జిల్లా సరిహద్దు కేవలం కిలోమీటరున్నర దూరంలో ఉంది. మరికల్ గ్రామస్తులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు వంద కిలోమీటర్లు వెళాల్సి వస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం 22కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి తెచ్చి నవాబుపేట మండలంలో కలపాలని వారు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
నవాబుపేట (రంగారెడ్డి) : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్‌వనంపల్లి గ్రామానికి చెందిన మరాటి నర్సింహులు(35) కుటుంబంతోపాటు హైదరాబాద్‌లో ఉంటూ పెయింటింగ్ పని చేసేవాడు. నర్సింహులు గత కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. దానికి తోడు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవపడి స్వగ్రామం గేట్వనంపల్లికి వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం నుంచి మద్యం మత్తులోనే ఉన్న నర్సింహులు రాత్రి 8 గంటల ప్రాంతంలో విష గుళికలు మింగి ఇంట్లో తలుపు వేసుకుని పడుకున్నాడు. ఎంత పిలిచినా సమాధానం ఇవ్వకపోవటంతో తండ్రి కిష్టయ్య రాత్రి తలుపులు పగులగొట్టి చూడగా మృతి చెంది ఉన్నాడు. నర్సింహులుకు భార్య పుష్పలత, కుమారుడు మనీష్(6), అమ్ములు(4) ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
వాహనం బోల్తా: పోలీసులకు తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, వారిని విజయవాడ తరలించాలని సదరు వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కాంగ్రెస్ ఖాతాలో వట్టిమీనపల్లి సొసైటీ
నవాబుపేట, న్యూస్‌లైన్: తీవ్ర ఉద్రిక్తతల మధ్య బుధవారం వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డులకుగాను ఇప్పటికే ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 8 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగిం ది. ఎనిమిది వార్డుల్లో మొత్తం 1,974 ఓట్లుం డగా 1,470 పోలయ్యాయి. 74శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి గంటలో ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 4, టీడీపీ మద్దతుదారులు 3, టీఆర్ఎస్ మద్దతుదారులు 1 వార్డు దక్కించుకున్నారు. ఏకగ్రీవమైన వాటిని కలుపుకుంటే మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకు 8, టీడీపీ మద్దతుదారులకు 3, టీఆర్ఎస్ మద్దతుదారులకు 2 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్‌లోని కాలె యాదయ్య వర్గానికి 3, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి 5 వార్డులు దక్కాయి. ఎన్నికైన వార్డు సభ్యులు వీరే... 1వ వార్డు: మాణిక్‌రెడ్డి, 2వ వార్డు: కె.కొండ య్య, 3వ వార్డు : ఆగంరెడ్డి, 4వ వార్డు : ఎల్.ప్రమూకమ్మ, 5వ వార్డు : ఎల్.మాణిక్‌రెడ్డి, 6వ వార్డు : కె.మాణిక్‌రెడ్డి, 7వ వార్డు : జనార్దన్‌రెడ్డి, 8వ వార్డు : ఎం.మల్లారెడ్డి, 9వ వార్డు : పూల్‌సింగ్, 10వ వార్డు :ప్రభు, 11వ వార్డు: మాణెయ్య , 12వ వార్డు : వెంకటమ్మ, 13వ వార్డు : పి.రాంరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తకీహుస్సేన్ తెలిపారు. గురువారం చైర్మన్, ఉప చైర్మన్‌తో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. ఉద్రిక్తత... కాగా, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇక్కడ కాలె యాదయ్య, చిట్టెపు మల్లారెడ్డి రెండు వర్గాలు ఉన్నాయి. వీరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. బుధవారం ఓటింగ్ జరుగుతుండగా ఇరువర్గాల నాయకులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మల్లారెడ్డి వర్గానికి చెందిన ఓ అభ్యర్థిని యాదయ్య వర్గీయులు తీసుకుపోయారంటూ గొడవ మొదలైంది. ఆగ్రహించిన మల్లారెడ్డి వర్గీయులు యాదయ్య వర్గానికి చెందిన అభ్యర్థిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారీ బందోబస్తు.. వికారాబాద్ డీఎస్పీ నర్సింలు, శిక్షణ డీఎస్పీ హ ర్ష, సీఐలు విజయ్లాల, లచ్చిరాం, ఎస్ఐలు చతుర్వేది, భీంకుమార్, శిక్షణ ఎస్ఐలు వెంకటేశ్వర్‌గౌడ్,అరుణ్‌కుమార్,శంషొద్దీన్,రమేష్, 60 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సందిగ్ధంలో చైర్మన్ ఎన్నిక .. కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలతో చైర్మన్ ఎన్నిక సందిగ్ధంలో పడింది. రెండు వర్గాలు ఏకమై చైర్మన్‌ను ఎన్నుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టీడీపీకీ, టీఆర్ఎస్కు పూర్తిస్థాయి స్థానా లు దక్కలేదు. దీంతో కాంగ్రెస్‌లోని ఓ వర్గానికి టీడీపీ, మరో వర్గానికి టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసు .. ఎన్నికల నిబంధన లు ఉల్లంఘించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ -2 వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. బుధవారం 11 గంటల సమయంలో మండల పరిధిలోని వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెపు మల్లారెడ్డి వర్గీయులు, కాలె యాదయ్య వర్గీయులు పరస్పరం గొడవపడి ఓటర్లకు ఇబ్బంది కలిగించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రెండు వర్గాలకు చెందిన పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు.