Wife Stages Protest At Husband House In Mahabubnagar, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి.. అయిదు రోజుల కాపురం, అంతలోనే మోసం

Published Wed, Jul 6 2022 10:12 AM | Last Updated on Wed, Jul 6 2022 11:10 AM

Wife Protest Infront Of  Husband House At Mahabubnagar - Sakshi

సత్యనారాయణ, రేణుక పెళ్లి ఫొటో, భర్త ఇంటి వద్ద నిరసనకు దిగిన రేణుక

సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రేమించానని నమ్మిం,పెళ్లి చేసుకున్నాడు.ఐదు రోజుల తర్వాత కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన నవాబుపేట మండలంలోని దేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణగౌడ్‌(23) అదేగ్రామానికి చెందిన రేణుక(21) అనే అమ్మాయినిచాలా ఏళ్లక్రితం నుంచి ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో గత నెల జూలై 17న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఐదు రోజుల పాటు కాపురం చేశారు. అనంతరం సత్యనారాయణ, తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సొంత గ్రామందేపల్లికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్‌ వెళ్లలేదు. 

అప్పుడు ఇపుడు వస్తానంటూ కాలయాపన చేస్తూవచ్చాడు. కొన్నాళ్లకు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. దీంతో తనను కేవలం ప్రేమ పేరుతో మోసం చేసి వాడుకుని వదిలేశాడని పేర్కొంటూ బాధితురాలుపోలీసులను ఆశ్రయింంది. అయినా ఫలితం లేకపోవటంతో మంగళవారం భర్త ఇంటి ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ప్రస్తుతం సత్యనారాయణను వారి బంధువులు అజ్ఞాతంలో ఉంచారని, తనకు న్యాయంచేయాలని కోరుతోంది. అప్పటి వరకు ఇంటి ముందే కూర్చుని నిరసన తెలుపుతానని చెప్పారు. ఈవిషయమై సీఐని వివరణ కోరగా ఉమెన్‌ పీఎస్‌కు రిఫర్‌ చేస్తామని అన్నారు. 
చదవండి: రాజస్థాన్‌ నుంచి వచ్చిన బురిడి బాబాలు.. దోష నివారణ పూజలు చేస్తామని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement