
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది.
గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment