కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు.
స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, వారిని విజయవాడ తరలించాలని సదరు వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.