Three police injured
-
మహారాష్ట్రలో మావోల ఘాతుకం: ఏడుగురు పోలీసులు మృతి
మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా పాయిమొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్నే లక్ష్యంగా పేల్చివేశారు. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మావోల ఘాతుకంపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అలాగే మావోయిస్టుల కోసం గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. -
వాహనం బోల్తా: పోలీసులకు తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, వారిని విజయవాడ తరలించాలని సదరు వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.