slipped
-
మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
నేతల ఉత్సాహ పూరిత ప్రసంగాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతుంటాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పొరపాటుగా ఒక వ్యాఖ్యానం చేసి, నలుగురిలో నవ్వులపాలయ్యారు.సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల ప్రసంగాల్లో జనాన్ని ఉత్సాహపరిచేందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఒక్కోసారి తడబటడం, నోరు జారడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం నితీష్ టంగ్ స్లిప్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.బీహార్‌లోని పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని దానియావాన్‌లో బీజేపీ నేత, ఎన్డీఏ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రసంగిస్తూ, లోక్‌సభలో బీజేపీ 400కు పైగా సీట్లను గెలుచుకుంటుందని, ప్రజలంతా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నితీష్ నోటివెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అయితే వేదికపై ఉన్న ఇతర నేతలు జరిగిన పొరపాటును సీఎంకు గుర్తు చేశారు. దీంతో ఆయన.. ప్రధాని మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని సర్దిచెప్పారు.గతంలోనూ సీఎం నితీష్ కుమార్ ఇలా పలుమార్లు నోరు జారారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి వీణా దేవికి మద్దతుగా ప్రసంగిస్తూ, బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్డీఏ గెలవాలని కోరుకుంటున్నానని, మన కూటమి దేశం మొత్తం మీద నాలుగు వేల సీట్లు గెలవాలని అభిలషిస్తున్నానని అన్నారు. -
Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు
సాక్షి, వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది.. ట్రాక్ మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. స్టేషన్ నుంచి ఓ ప్రయాణికుడు హుటాహుటినా పరుగెత్తుకొచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలుకు, ట్రాక్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. రైల్వే సిబ్బంది, పోలీసులు రెండు గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ప్లాట్‌ఫాం పగులగొట్టి ప్రయాణికుడిని అతడిని బయటకు తీశారు. అతడికి స్వల్ప గాయాలవ్వగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్ A man slipped and got stuck between the train and platform, while attempting to board a moving train at #Vikarabad Railway Station and was dragged along, recorded in #CCTV . The alert passengers, RPF, railway officials saved the life of the passenger. (1/2)#Telangana pic.twitter.com/2iQDtUHSWd— Surya Reddy (@jsuryareddy) January 30, 2024 -
రైలు ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్!
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారి పడిపోయిన ఓ మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన హౌరా స్టేషన్ ఓల్డ్ కాంప్లెక్స్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10.50 గంటలకు 40 ఏళ్ల ఫాతిమా ఖాతూన్ తన బంధువుతో పాటు హౌరా-తారకేశ్వర్ లోకల్ ఎక్కేందుకు వచ్చారు. వీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఫాతిమా బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. ఇంతలో రైలు వేగం పెరగడంతో ఆమె రైలు పట్టాలకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఆమె బంధువు ఆమెను రైలు కిందకు జారిపోకుండా పైకి లాగడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన అక్కడే ఉన్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎల్కే బౌరీ వెంటనే ఫాతిమా వద్దకు పరిగెత్తారు. ఆమె చేయి పట్టుకుని పైకిలాగి ఆమె ప్రాణాలను కాపాడారు. సీసీటీవీ ఫుటేజీలో.. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న పలువురు ప్రయాణికులు ఫాతిమాను రక్షించేందుకు ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. పలువురు పోలీసులు కూడా ఆమెకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పోలీసుల చొరవను తూర్పు రైల్వే ప్రశంసించింది. ఇది కూడా చదవండి: రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం चलती ट्रेन में चढ़ते समय फिसल गई महिला, फरिश्ता बनकर आए पुलिसकर्मी ने बचाई जान pic.twitter.com/7hyYXCh6Pc — NDTV India (@ndtvindia) November 30, 2023 -
నడుస్తుండగా కిందపడిపోయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరైన ఆమె.. నడుస్తూ నడుస్తూ మ్యాట్ తగిలి సడన్‌గా కిందపడ్డారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు సాయం అందించడంతో ఆమె లేచి నిల్చున్నారు. అనంతరం యథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ప్రయోగం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం మహాబలిపురంలో ఈ ఈవెంట్ జరిగింది. దేశంలోని అనేక పాఠశాలలకు చెందిన 3,500మంది విద్యార్థులు రూపొందించిన 150 చిన్నసైజు ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. 'ఏపీజే అబ్దుల్‌కలాం స్టూడెంట్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్-2023' పేరుతో వీటిని ప్రయోగించారు. గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
ప్రాణం తీసిన వీడియో కాల్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండలో నివసించే తాళ్లూరి శ్యామ్యూల్ సుజిత్ (32) ప్రైవేటు ఉద్యోగి. శనివారం ఉదయం తన సోదరుడితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండో అంతస్తులోని బాల్కనీలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సుజిత్ జారిపడ్డాడు. వెంటనే స్పందించిన పక్కింటివారు సుజిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజిత్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కాడు.. అంతలోనే
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్‌పేటకు చెందిన కిష్టయ్య భూమి విషయంలో తన సోదరునితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం తనకు న్యాయం చేయాలంటూ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కిష్టయ్యను సముదాయించి కిందికి దించే ప్రయత్నంలో అతను ఒక్కసారిగా అదుపుతప్పి టవర్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు.కాగా కిష్టయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతన్ని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం అందింది. -
మెక్సికోలో షాకింగ్ ఇన్సిడెంట్
-
రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కుప్పం రూరల్ : చెన్నై – బెంగళూరు రైలు మార్గంలోని కుప్పం ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతునికి 50 ఏళ్లు ఉంటాయని, క్రీమ్ కలర్ స్వెట్టర్, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు ధరించాడని తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. హౌరా – యశ్వంత్‌పూర్ రైలు టికెట్టు మాత్రం ఉందన్నారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతదేహాన్ని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించామన్నారు. -
గాలి పటం ఎగురవేస్తుండగా జారి పడి..
-
గాలిపటం ఎగురవేస్తుండగా..
సాక్షి, నందిగామ: సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో గాలిపటాలు ఎగరవేస్తుండగా భవనంపైనుంచి జారిపడి ఓ బాలుడు మృతిచెందాడు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నితీష్ కుమార్(15) గాలిపటం ఎగురవేస్తుండగా అపార్టుమెంట్‌పై నుంచి జారి కిందపడి మృతిచెందాడు. మృతుడు నందిగామలోని ఓ ప్రెవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. -
రైలు ఎక్కుతూ కింద పడి మహిళ మృతి
ఏలూరు అర్బన్ : కూతురుని చూసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్సై ఎన్. రాము కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన బోడిదాసు అంబికా ప్రసాద్, కమలవాణి (55) దంపతుల కూతురు కృష్ణాజిల్లా చిన అవుటపల్లిలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కమలవాణి కూతురును చూసుకునేందుకు శనివారం విశాఖపట్నం నుంచి చిన అవుటపల్లి వచ్చింది. అనంతరం ఆదివారం రాత్రి విశాఖ తిరిగి వెళ్లేందుకు గన్నవరంలో కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్ కింద పడి మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. -
రైలు నుంచి జారిపడిన వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్ : నౌపడ గ్రామ సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... బరంపురానికి చెందిన సంజయ్ కూలి పనుల నిమిత్తం ఆదివారం రైలులో బరంపురం నుంచి చెన్నై రైలులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో సంతబొమ్మాళి మండల సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడుని టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మరో అథ్లెట్ ఆత్మహత్యాయత్నం
తిరువనంతపురం: మొన్నటికి మొన్న మహిళా అథ్లెట్ ఆత్మహత్య సంఘటన మరిచిపోకముందే కేరళలో మరో యువ క్రీడాకారుడి ఆత్మహత్యాయత్నం క్రీడావర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. శిక్షణలో ఉన్న 18 ఏళ్ల అథ్లెట్ చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు పారిపోయాడు. చేతికి గాయం చేసుకొని పడి ఉన్న అతడ్ని గమనించి మెడికల్ కాలేజీకి తరలించారు. గాయానికి కుట్టు వేసిన వైద్యులు అతనికి ప్రాణాపాయం లేదని తేల్చారు. కానీ మానసిక వైద్య విభాగానికి రెఫర్ చేశారు. ఇంతలోనే అతడు కనిపించాకుండా పోయాడని పోలీసులంటున్నారు. అయితే హాస్టల్లో దొంగతనం చేయడంతో సహచరులు అతడిని ప్రశ్నించారని, దీంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి..పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గత నెలలో విషపూరితమైన పళ్లు తిని నలుగురు మహిళా అథ్లెట్లు ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. కోచ్ వేధింపుల వల్లే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
బస్సు అదుపుతప్పి 8మందికి గాయాలు
బిక్నూరు : ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ నంబరు జాతీయ రహదారిపై భైంసా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.