Telangana Governor Tamilisai falls while walking at Tamil Nadu event - Sakshi
Sakshi News home page

Telangana Governor: నడుస్తుండగా కిందపడిపోయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Published Mon, Feb 20 2023 10:27 AM | Last Updated on Mon, Feb 20 2023 3:20 PM

Telangana Governor Tamilisai Fall Down In Tamil Nadu Event - Sakshi

చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరైన ఆమె.. నడుస్తూ నడుస్తూ మ్యాట్‌ తగిలి సడన్‌గా కిందపడ్డారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది,  అధికారులు సాయం అందించడంతో ఆమె లేచి నిల్చున్నారు. అనంతరం యథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ప్రయోగం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం మహాబలిపురంలో  ఈ ఈవెంట్ జరిగింది. దేశంలోని  అనేక పాఠశాలలకు చెందిన 3,500మంది విద్యార్థులు రూపొందించిన 150 చిన్నసైజు ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి.  'ఏపీజే అబ్దుల్‌కలాం స్టూడెంట్స్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ మిషన్‌-2023' పేరుతో వీటిని ప్రయోగించారు. గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


చదవండి: ధర తక్కువ.. డిమాండ్‌ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement