సాక్షి, వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది.. ట్రాక్ మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది.
బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. స్టేషన్ నుంచి ఓ ప్రయాణికుడు హుటాహుటినా పరుగెత్తుకొచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలుకు, ట్రాక్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు.
రైల్వే సిబ్బంది, పోలీసులు రెండు గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ప్లాట్‌ఫాం పగులగొట్టి ప్రయాణికుడిని అతడిని బయటకు తీశారు. అతడికి స్వల్ప గాయాలవ్వగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్
A man slipped and got stuck between the train and platform, while attempting to board a moving train at #Vikarabad Railway Station and was dragged along, recorded in #CCTV .
The alert passengers, RPF, railway officials saved the life of the passenger. (1/2)#Telangana pic.twitter.com/2iQDtUHSWd— Surya Reddy (@jsuryareddy) January 30, 2024
Comments
Please login to add a commentAdd a comment