
మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తి
కుప్పం రూరల్ : చెన్నై – బెంగళూరు రైలు మార్గంలోని కుప్పం ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతునికి 50 ఏళ్లు ఉంటాయని, క్రీమ్ కలర్ స్వెట్టర్, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు ధరించాడని తెలిపారు.
మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. హౌరా – యశ్వంత్‌పూర్ రైలు టికెట్టు మాత్రం ఉందన్నారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతదేహాన్ని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment