కుక్కల దాడిలో బాలుడికి గాయాలు | Boy dog attack injuries | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

Dec 15 2016 11:16 PM | Updated on Jul 12 2019 3:02 PM

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు - Sakshi

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

మండలంలోని ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనితబాయి, సుధాకర్‌ నాయక్‌ దంపతుల కుమారుడు రాజేశ్‌నాయక్‌(5) వీధి కుక్కల దాడిలో గురువారం గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఓబుళదేవరచెరువు: మండలంలోని ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనితబాయి, సుధాకర్‌ నాయక్‌ దంపతుల కుమారుడు రాజేశ్‌నాయక్‌(5) వీధి కుక్కల దాడిలో గురువారం గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా మూడు కుక్కలు దాడి చేసి, నోట కరచుకొని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాయన్నారు. బాలుడి కేకలు విన్న అక్కడి పరసర ప్రాంత ప్రజలు వెంటనే బాలుడ్ని కాపాడారన్నారు. లేకపోతే చిన్నారిని చంపేసేవని చెప్పారు. గాయపడ్డ బాలుడ్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడ్ని ఎంపీపీ ఇస్మాయిల్‌ పరామర్శించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement