attack dogs
-
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ఓబుళదేవరచెరువు: మండలంలోని ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనితబాయి, సుధాకర్ నాయక్ దంపతుల కుమారుడు రాజేశ్‌నాయక్(5) వీధి కుక్కల దాడిలో గురువారం గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా మూడు కుక్కలు దాడి చేసి, నోట కరచుకొని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాయన్నారు. బాలుడి కేకలు విన్న అక్కడి పరసర ప్రాంత ప్రజలు వెంటనే బాలుడ్ని కాపాడారన్నారు. లేకపోతే చిన్నారిని చంపేసేవని చెప్పారు. గాయపడ్డ బాలుడ్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడ్ని ఎంపీపీ ఇస్మాయిల్ పరామర్శించారు. -
కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి
కనగానపల్లి : మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు. ఇన్ని జీవాలు ఒకేసారి మృతి చెందటంతో జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
పరిమళించిన మానవత్వం
- కుక్కల దాడిలో గాయపడిన - కోతిని రక్షించిన వైద్య విద్యార్థులు బళ్లారి (తోరణగల్లు):విమ్స్ ప్రాంగణంలోని అనాటమీ విభాగం వద్ద చెంగుచెంగున ఎగురుతూ ఆకట్టుకొంటున్న ఓ కోతిపై నాలుగు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకొన్నాయి. అయితే ఆ కోతికి అంగవైకల్యం ఉన్నందున తప్పించుకొని చెట్టు ఎక్కలేక పోయింది. దీంతో ఆ నాలుగు కుక్కలు తీవ్రంగా కొరికి గాయపరిచాయి. వెంటనే లైబ్రరీ వద్ద ఉన్న వైద్యవిద్యార్థులు కుక్కలను రాళ్లతో కొట్టితరిమారు. కాని తీవ్రంగా గాయపడిన కోతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. స్పందించిన వైద్యవిద్యార్థులు, వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. మూగజీవాలను రక్షించే సంస్థ పెట్స్ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆర్గనైజేషన్ సభ్యురాలు నిఖిత కోతిరక్షణకు పూనుకొంది. వెటరినరీ వైద్యుడు డాక్టర్ వసంత్, డాక్టర్ బిందు, డాక్టర్ మల్లికార్జున, విమ్స్ వైద్యవిద్యార్థులు మేఘన, గౌతమిలతో పాటు జంతుప్రదర్శనశాల అధికారి మంజులు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కష్టించి కోతికి సర్జరీ చేసి ప్రాణాలను కాపాడారు. మెరుగైన చికిత్స కోసం జంతు ప్రదర్శనశాల అధికారులు బెంగుళూరుకు తరలించారు. మానవత్వంతో కోతి ప్రాణాలను రక్షించిన నిఖిత, విమ్స్ వైద్యవిద్యార్థులకు ప్రజలు అభినందనలు తెలిపారు. -
మాదన్నపేట్‌లో దారుణం చిన్నారిపై కుక్కలదాడి
-
మాదన్నపేట్‌లో దారుణం చిన్నారిపై కుక్కలదాడి
మాదన్నపేట్: మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది , రెండేళ్ల చిన్నారి లావణ్యపై అర్థరాత్రి కుక్కలదాడి చేశాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది అన్ని, చిన్నానారిని దగ్గరలోని ఆస్సత్రికి తరలించి చిక్సిత అందిస్తున్నారు.