సంతమాగులూరు(ప్రకాశం): కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్థులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు.