![విజయసాయిరెడ్డిని పరామర్శించిన జగన్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51463008499_625x300.jpg.webp?itok=oVfSinXU)
విజయసాయిరెడ్డిని పరామర్శించిన జగన్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా బుధవారం మధ్యాహ్నం వెళ్లి పరామర్శించారు. జగన్ దంపతులు కొద్దిసేపు సాయిరెడ్డి వద్ద ఉండి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులతో మాట్లాడారు. సాయిరెడ్డి త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో నేత సాగి దుర్గాప్రసాదరాజు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను బుధవారం ఉదయమే వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.