కమల్ హాసన్కు గాయాలు | Actor Kamal Haasan injured, admitted to hospital | Sakshi
Sakshi News home page

కమల్ హాసన్కు గాయాలు

Published Thu, Jul 14 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

కమల్ హాసన్కు గాయాలు

కమల్ హాసన్కు గాయాలు

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ జారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయం అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కమల్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సర్జరీ చేసిన వైద్యులు ప్రమాదం ఏమి లేదని , రేపు డిస్ చార్జ్ చేయనున్నట్టు తెలిపారు.

కమల్ ఇటీవలే శభాష్ నాయుడు షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. కమల్ తొలిసారిగా తన కూతురు శృతిహాసన్ తో కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రం ప్రస్తుతం సెట్స్ ఉంది. ఈ చిత్రాన్ని కమల్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement